నిర్మాత దిల్ రాజుకి షాకిచ్చిన మోడల్..!

నిర్మాత దిల్ రాజుకి షాకిచ్చిన మోడల్..!
అయితే ఈ సినిమాలో తన అనుమతి లేకుండా తన ఫోటోను ఉపయోగించారని ఆరోపిస్తూ నిర్మాత దిల్ రాజుపై బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు మోడల్‌ సాక్షి మాలిక్‌.

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్‌ బాబు, నివేదా థామస్‌, అదితిరావు హైదరి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'వి'.. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. అయితే ఈ సినిమాలో తన అనుమతి లేకుండా తన ఫోటోను ఉపయోగించారని ఆరోపిస్తూ నిర్మాత దిల్ రాజుపై బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు మోడల్‌ సాక్షి మాలిక్‌.

ఈ సినిమాలో.. మొబైల్ ఫోన్‌లో కమర్షియల్ సెక్స్ వర్కర్ ఫొటోను వేరే వ్యక్తికి చూపించే సన్నివేశం ఉంది. అయితే ఆ ఫొటో తనదేనని ఆరోపిస్తూ సాక్షి మాలిక్ కోర్టుకెక్కారు. అయితే దీనిపైన స్పందించిన కోర్టు.. చిత్రం స్ట్రీమింగ్ అవుతోన్న ఓటీటీ ప్లాట్‌ఫాంకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వేరే వ్యక్తుల ఫోటోలను, ముఖ్యంగా ప్రైవేట్ ఇమేజ్‌ను ఉపయోగించడం చట్ట రీత్యా నేరమని.. ఇది తమ పరువుకు నష్టం కలింగించవచ్చని పేర్కొంది.

ఇక దీనిపైన మోడల్ సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. సినిమాలోని ఆ సన్నివేశాలను ​వెంటనే తొలగించాలని.. ఆ తరవాత సినిమాని అప్‌లోడ్‌ చేయాలని ప్రొడక్షన్‌ హౌజ్‌ను ఆదేశించింది. కాగా ఇప్పటికే 'వి' సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి తొలగించారు.

Tags

Read MoreRead Less
Next Story