శాకుంతలం ఫెయిల్యూర్.. సమంత పోస్ట్ వైరల్
అందమైన పోస్టర్.. అంతకంటే అందంగా సినిమా ఉంటుందని ఊహించుకున్నారు ప్రేక్షకులు.. కానీ సగటు ప్రేక్షకుడిని కూడా మెప్పించలేకపోయింది శాకుంతలం. మయోసైటిస్‌తో కోలుకున్న సమంతకు మంచి హిట్ పడాలని ఫ్యాన్స్ బలంగా కోరుకున్నారు. కానీ ఆమె వారి ఆశలను అడియాసలు చేసింది. అయితే ఆ విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని చెప్పకనే చెప్పింది. భగవద్గీతలోని ఓ శ్లోకాన్ని పోస్ట్ చేస్తూ ఆ విషయాన్నే పేర్కొంది.
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ పౌరాణిక ఇతిహాసం దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించబడింది. పాన్-ఇండియా మూవీగా విడుదలైనప్పటికీ శాకుంతలం పది కోట్ల గ్రాస్ కూడా వసూలు చేయలేకపోయింది. ఈ చిత్రం నిర్మాతకు భారీ నష్టాన్ని మిగిల్చింది. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న శాకుంతలం సినిమాలో నటీనటుల ఎంపిక కానీ, పనితీరు కానీ ప్రేక్షకులను సంతృప్తి పరచలేకపోయింది. దాంతో చిత్రం దారుణమైన విమర్శలకు గురైంది. దీంతో సమంత ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.
భగవద్గీత నుండి ఒక శ్లోకాన్ని ప్రస్తావించింది.. "కర్మణ్యే వాధికా రాస్తే... మా ఫలేషు కదాచన... మా కర్మ ఫల హే తుర్ భూః... మా తే సంఘోత్స్వ కర్మణి" అనే శ్లోకం పోస్ట్ చేసింది. దీని భావం ఇలా సాగుతుంది.. మీకు పని చేయడం మీదే అధికారం ఉంది తప్ప.. దాని ఫలితం మీద కాదు.. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే పని చేయడం మానకూడదు.. ప్రతిఫలం ఆశించకుండా పని చేయి అని ఆ వాఖ్యలకు అర్థం.
ఆమె నటించిన శాకుంతలం ఫెయిల్యూర్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం సమంత తన తదుపరి చిత్రం ఖుషిపై దృష్టి పెట్టింది. విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com