Salaar Part 1 Ceasefire : 'మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా': నెటిజన్ల భిన్నాభిప్రాయాలు

Salaar Part 1 Ceasefire : మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా:  నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్నప్రభాస్ 'సాలార్' థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైంది.

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాలార్ పార్ట్ వన్: సీజ్ ఫైర్' ఎట్టకేలకు సినిమాల్లో విడుదలైంది. ఆదిపురుష్ పరాజయం తరువాత, ఈ చిత్రం నటులు ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సాలార్‌'లో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. షారుఖ్ ఖాన్ నటించిన 'డుంకీ' హిందీ బెల్ట్‌లో సాలార్ కంటే ఖచ్చితంగా మెరుస్తుంది కాబట్టి ఈ చిత్రం దక్షిణాది ప్రాంతంలో మంచి ప్రదర్శన ఇస్తుందని భావిస్తున్నారు.

ఇక తాజాగా రిలీజైన 'సాలార్' విషయానికొస్తే.. 1995 బ్యాక్‌ డ్రాప్‌లో సాగే చిన్నారుల స్నేహం నేపథ్యంలో కథ మొదలవుతుంది. దేవా వాగ్దానంతో 'సాలార్' టైటిల్ కార్డు పడుతుంది. సూరేడే పాట వస్తుంది. ఆ తర్వాత శ్రియారెడ్డి తన గ్యాంగ్‌తో శృతిహాసన్‌ కోసం రావడంతో.. గూస్‌ బంప్స్ తెప్పించే ప్రభాస్‌ గ్రాండ్ ఎంట్రీ సీన్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ప్రభాస్‌ క్రేజ్‌తో రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంటరవడం పక్కా అని హ్యాష్‌ట్యాగ్‌ను తెగ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

అసోం కోల్‌ మైన్స్‌లో ప్రభాస్‌, శృతిహాసన్‌, ఈశ్వరీ రావ్‌ మధ్య వచ్చే సీన్లతో సాగుతుంది. భారీ ఫైట్‌ సీన్‌, ట్విస్టుల తర్వాత వరద పృథ్విరాజ్‌ ఇంట్రడక్షన్‌ ఉంటుంది. ఓ వైపు ప్రభాస్‌ వయోలెంట్ అవతార్‌.. మరోవైపు పృథ్విరాజ్‌ సుకుమారన్‌, ప్రభాస్‌ మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయంటున్నారు మూవీ లవర్స్‌. ఇంటెన్స్ యాక్షన్‌ సీక్వెన్స్‌లో సూపర్ ఎలివేషన్‌తో సాగే ప్రభాస్‌ యాక్షన్‌ అవతార్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచిపోతుందంటున్నారు సినీ జనాలు. రెండు ఫైట్స్‌ 'సాలార్‌' బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలపడం ఖాయమని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో తన మేనియా కొనసాగుతుందని ట్రేడ్ సర్కిల్ సమాచారం. ఇదిలా ఉండగా 'సాలార్' ప్రారంభ ప్రదర్శనల నుండి చాలా సానుకూల సమీక్షల తర్వాత, చాలా మంది సోషల్ మీడియా యూజర్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని 'డిజాస్టర్' అని కూడా అభివర్ణిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story