లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి హత్య బెదిరింపుల గురించి మౌనం వీడిన సల్మాన్

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి హత్య బెదిరింపుల గురించి మౌనం వీడిన సల్మాన్
X
తాను నటించిన 'సికందర్' విడుదల సమయంలో, లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుండి హత్య బెదిరింపుల గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడారు.

తాను నటించిన 'సికందర్' విడుదల సమయంలో, లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుండి హత్య బెదిరింపుల గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడారు.

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుండి తరచుగా హత్య బెదిరింపులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, ఈ బెదిరింపులు తనను ప్రభావితం చేస్తాయా లేదా అనే దానిపై ఇటీవల స్పందించారు. తాను దేవుడిని నమ్ముతానని, తనకు దేవుడు ఆయుష్షు ఇచ్చినంత కాలం కాలం జీవిస్తానని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం తాను నటించిన సికందర్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సల్మాన్, ముంబైలో కొన్ని మీడియా ప్రతినిధులతో సంభాషించాడు. అల్లాహ్ చూస్తున్నారు. ఎవరి జీవితం ఎంత కాలం రాసి పెట్టి ఉంటుందో అంత కాలం జీవించాలి.. అంతే అని స్పందించాడు.

ముంబైలోని బాంద్రాలో తన నివాసం వెలుపల జరిగిన కాల్పుల సంఘటన మరియు అనేక హత్య బెదిరింపుల తర్వాత, నటుడి భద్రతను గణనీయంగా పెంచారు. నిరంతరం భద్రతాదళాలతో కలిసి నడవడం కష్టంగా ఉంటుంది అని పేర్కొన్నారు. ఇప్పుడు తాను తన ఇల్లు మరియు పని ప్రదేశాల మధ్య మాత్రమే ప్రయాణిస్తున్నానని ఆయన వెల్లడించారు.

2018లో జోధ్‌పూర్ కోర్టుకు హాజరైన లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌ను చంపేస్తానని బహిరంగంగా బెదిరించాడు. హమ్ సాథ్ సాథ్ హై చిత్రీకరణ సమయంలో బ్లాక్ బక్‌ను చంపినందుకు నటుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని గ్యాంగ్‌స్టర్ కోరుకుంటున్నాడు. బ్లాక్ బక్‌ను బిష్ణోయ్ సమాజం గౌరవిస్తుంది.

ఇదిలా ఉండగా, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన మాస్-యాక్షనర్ సికందర్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు . AR మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది, ఇందులో కాజల్ అగర్వాల్ మరియు రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించారు.

Tags

Next Story