Tiger 3 Trailer Release Date : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ రివీల్

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'టైగర్ 3' ఈ సంవత్సరం బాలీవుడ్ చిత్రాలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్, 'టైగర్ కా మెసేజ్' వీడియో విడుదలతో మేకర్స్ .. మూవీపై బాగానే హైప్ క్రియేట్ చేయగలిగారు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది.
ఇంతకుముందు, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ల 'టైగర్ 3' ట్రైలర్ అక్టోబర్ మధ్యలో విడుదల కానుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు, ఈ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ తేదీని స్టూడియో యష్ రాజ్ ఫిల్మ్స్ వెల్లడించింది. అధికారిక ట్రైలర్ సోమవారం, అక్టోబర్ 16న ఇంటర్నెట్‌లో విడుదల కానుంది. YRF ట్విట్టర్ హ్యాండిల్ ఈ వార్తను ప్రకటించింది. "టైగర్ 3 ట్రైలర్ అక్టోబరు 16న మునుపెన్నడూ లేనంతగా గర్జించబోతోంది. టైగర్ 3 ఈ దీపావళికి సినిమాల్లోకి వస్తుంది. హిందీ, తమిళం & తెలుగులో విడుదలవుతోంది" అని ప్రకటించింది.
ఈ వార్తపై చాలా మంది తమ ఉత్సాహాన్ని ఆపుకోలేకపోతున్నారు. "ది బిగ్ డాడీ ఆఫ్ స్పై యూనివర్స్" అని ఓ యూజర్ స్పందించగా.. "భాయ్ ఈజ్ బ్యాక్ విత్ టైగర్ 3" అని మరో అభిమాని అన్నాడు.
టైగర్ 3 గురించి
'టైగర్ 3'కి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటిస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ YRF గూఢచారి యూనివర్స్ లో ఒక భాగం. దీపావళి పండుగ కానుకగా నవంబర్ 10న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్రాంచైజీలో మొదటి చిత్రం, 'ఏక్ థా టైగర్', 2012లో విడుదలైంది. దీనికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. 'టైగర్ జిందా హై' పేరుతో రెండవ భాగం 2017లో విడుదలైంది. దీనికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు.
ఇటీవల, ఖాన్ 'టైగర్ 3'తో బాలీవుడ్‌లో తన 35 ఏళ్లను జరుపుకోవడం గురించి మాట్లాడాడు. "టైగర్ 3 విడుదలతో ఈ వ్యక్తిగత మైలురాయిని జరుపుకోవడం నాకు ఆనందంగా ఉంది! నా అభిమానులు నేను యాక్షన్ చేయడం చూసి ఇష్టపడతారని నాకు తెలుసు. టైగర్ 3 వారు ఎదురుచూస్తున్న కంప్లీట్ గిఫ్ట్!", అన్నాడాయన. "నాకు పెద్ద యాక్షన్ సీన్స్ చేయడం చాలా ఇష్టం. టైగర్ 3లో అవి చాలానే ఉంటాయి" అని చెప్పాడు.
#Tiger3Trailer coming to roar louder than ever on 16th October. #Tiger3 arriving in cinemas this Diwali. Releasing in Hindi, Tamil & Telugu. #YRF50 | #YRFSpyUniverse pic.twitter.com/7KzMZA8Nx4
— Yash Raj Films (@yrf) October 4, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com