Salman Khan : సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీ స్టార్ట్

రేర్ గా మూవీస్ చేస్తున్నా డిఫరెంట్ మూవీస్ తో ఆకట్టుకుంటాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అతని లాస్ట్ మూవీ వారసుడు. విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినా తమిళ్ లో మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత వంశీ పైడిపల్లి, సల్మాన్ ఖాన్ తో మూవీ చేస్తాడు అనే టాక్ ముందు నుంచీ వినిపించింది. రీసెంట్ గా ఆ టాక్ నిజమే అని వాళ్లే అనౌన్స్ చేశారు. విశేషం ఏంటంటే.. ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దిల్ రాజు గతంలోనే తన నిర్మాణాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింప చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ఈ మూవీ రూపొందుతోంది.
ఇవాళ సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబోలో రూపొందుతోన్న మూవీ ముహూర్తంతో మొదలైంది. ముహూర్తంతో పాటు సినిమా ఇవాళ్టి నుంచి బిగెన్ అయింది. దిల్ రాజు బ్యానర్ లో ఇది 63వ సినిమా. భారీ స్థాయిలో ఉండబోతోందని ముందు నుంచీ చెబుతున్నారు. వంశీ మూవీస్ అంటే మాస్ తో పాటు క్లాస్ ను కూడా మెప్పించే అంశాలన్నీ పుష్కలంగా ఉంటాయి. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో.. ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
