Tiger 3 Banned : ఆ దేశాల్లో సల్మాన్ కొత్త చిత్రం బ్యాన్.. ఎందుకంటే

Tiger 3 Banned : ఆ దేశాల్లో సల్మాన్ కొత్త చిత్రం బ్యాన్.. ఎందుకంటే
సల్మాన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఒమన్, ఖతార్, కువైట్‌తో సహా కొన్ని మిడిల్-ఈస్ట్ దేశాలలో 'టైగర్ 3'పై నిషేధం

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'టైగర్ 3'.. ఈ సంవత్సరం చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. దీపావళి కానుకగా నవంబర్ 12 న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఒమన్, ఖతార్, కువైట్‌తో సహా కొన్ని మిడిల్-ఈస్ట్ దేశాలలో సల్మాన్, కత్రినాల అభిమానులు 'టైగర్ 3'ని ఆస్వాదించలేరు. ఎందుకంటే ఆయా దేశాల్లో ఈ సినిమాను బ్యాన్ చేశారు. ఈ దేశాల్లో నిషేధం వెనుక ఇస్లామిక్ దేశాలను, పాత్రలను ప్రతికూలంగా చిత్రీకరించడమే కారణమని నివేదిక పేర్కొంది.

అయితే, నిషేధానికి సంబంధించి చిత్ర నిర్మాతల నుండి గానీ, ప్రధాన తారాగణం నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హిందీ సినిమాల్లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా అవతరిస్తుందని మేకర్స్ తో పాటు అభిమానులు ఆశిస్తున్నారు. ట్రేడ్ విశ్లేషకుడు, సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ప్రకారం, ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే PVR, సినీపోలిస్‌తో సహా దేశంలో 1 లక్ష టిక్కెట్ల విక్రయాల మార్కును దాటింది.

సినిమా గురించి

'టైగర్' ఫ్రాంచైజీ మూడో పార్ట్ కు మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రాబోయే ఈ స్పై-థ్రిల్లర్ చిత్రంలో సల్మాన్, కత్రినా గత రెండు ఎడిషన్‌లలోని అవినాష్, జోయా పాత్రలను తిరిగి పోషించనున్నారు. ఇమ్రాన్ హష్మీ, కుముద్ మిశ్రా, రేవతి, రిద్ధి డోగ్రా, అనంత్ విధాత్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన 'టైగర్ 3' ఈ దీపావళికి నవంబర్ 12న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ చిత్రం 'పఠాన్' షారుక్ ఖాన్ నుండి పొడిగించిన అతిధి పాత్రను కలిగి ఉంటుంది. అయితే 'టైగర్ 3' SRK-నటించిన 'పఠాన్', హృతిక్ రోషన్ 'వార్' సంఘటనల తర్వాత కథాంశాన్ని అనుసరిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story