Bollywood: సల్మాన్‌కు మరో బెదిరింపు కాల్.. ఏప్రిల్ 30 టార్గెట్..

Bollywood: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మరో హత్య బెదిరింపు కాల్ వచ్చింది. సల్మాన్ ఖాన్‌కి రాకీ అనే వ్యక్తి నుంచి మరో హత్య బెదిరింపు కాల్ వచ్చింది. క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా బెదిరింపుల మధ్య నటుడు బుల్లెట్ ప్రూఫ్ SUVని కొనుగోలు చేసిన రెండు రోజుల తర్వాత మళ్లీ ఈ కాల్ వచ్చింది. ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు. ఈ కాల్ సోమవారం రాత్రి 9 గంటలకు ముంబై పోలీసులకు అందింది. దీనిపై విచారణ జరుగుతోంది. కాల్ చేసిన వ్యక్తిని రాకీ భాయ్‌గా గుర్తించిన పోలీసులు, అతను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందినవాడని, అతను గో రక్షకుడు అని తెలుసుకున్నారు. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే సూపర్‌స్టార్‌కు భద్రతను కూడా పెంచారు. ఇటీవల అతడు కొనుగోలు చేసిన కొత్త నిస్సాన్ పెట్రోల్ SUV వాహనం భారతీయ మార్కెట్లోకి ఇంకా రాలేదు. కానీ అతని భద్రత దృష్ట్యా, నటుడు దక్షిణాసియా మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఖరీదైన వాహనాన్ని దిగుమతి చేసుకున్నాడు. ఇప్పటికే సల్మాన్‌కు ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ (API)-ర్యాంక్ అధికారులు, పది మంది కానిస్టేబుళ్లు అతడికి 24 గంటలూ భద్రతను అందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com