Salman Khan : సల్మాన్ ఖాన్ సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదే

Salman Khan :  సల్మాన్ ఖాన్ సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదే
X

బాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకడైన సల్మాన్ ఖాన్ సినిమా అంటే ఏ రేంజ్ హడావిడీ ఉంటుందో అందరికీ తెలుసు. ప్రతి ఈద్ టైమ్ తన సినిమా విడుదల చేయడం సల్మాన్ కు ఓ సెంటిమెంట్. రిజల్ట్ తో పనిలేకుండా ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటాడు. అలా ఈ సారి కూడా ‘సికందర్’ అనే మూవీతో వస్తున్నాడు. నేషనల్ వైడ్ గా తిరుగులుని క్రేజ్ తెచ్చుకున్న రష్మక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని తమిళ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేశాడు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మించాడు.

ఈ నెల 28న విడుదల కాబోతోంది సికందర్. కానీ ఇప్పటి వరకూ ఈ మూవీకి మినిమం హైప్ కూడా క్రియేట్ కాలేదు. అస్సలే మాత్రం బజ్ రావడం లేదు. ఆ మధ్య విడుదలైన పాట హైప్ తేవడం అటుంచితే విపరీతంగా ట్రోల్ అయింది. ఇక కాజల్ అగర్వాల్ కూడా నటిస్తోందనే వార్త తెలిసిన తర్వాత ఏ మాత్రం హైప్ రావడం లేదు. రిలీజ్ చూస్తే పది రోజులు కూడా లేదు. దీంతో ఈ మూవీకి బజ్ రావాలంటే ఏం చేయాలా అని తలలు పట్టుకున్నారు అంతా. ముఖ్యంగా మురుగదాస్ ఈ చిత్రంపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు అనేది బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోన్న వార్త. అతను శివకార్తికేయన్ తో మధరాసి అనే మూవీ చేస్తున్నాడు. సికందర్ కంటే ఈ చిత్రంపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి.

అవన్నీ పక్కన పెడితే అసలు సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్ మూవీకి పండగ టైమ్ లో రిలీజ్ అవుతోన్న సినిమాకు అస్సలే మాత్రం బజ్ రాకపోవడం చూసి అక్కడి ట్రేడ్ కూడా ఆశ్చర్యపోతోంది. మరి సికందర్ తో సల్మాన్ కు ఎలాంటి రిజల్ట్ రాబోతోందో ముందే అంచనా వేయొచ్చా..

Tags

Next Story