ఫ్యామిలీ మ్యాన్ ఎఫెక్ట్.. 'సామ్' రెమ్యునరేషన్ హైక్..

ఫ్యామిలీ మ్యాన్ ఎఫెక్ట్.. సామ్ రెమ్యునరేషన్ హైక్..
సమంత అక్కినేని వెండి తెరపైనే కాదు వెబ్ సిరీస్‌లోనూ తనదైన మార్క్ చూపిస్తోంది.

సమంత అక్కినేని వెండి తెరపైనే కాదు వెబ్ సిరీస్‌లోనూ తనదైన మార్క్ చూపిస్తోంది. పాత్రకు ప్రాణం పెట్టి నటిస్తోంది. అందుకే ప్రేక్షకుల హృదయాల్లో ఫ్యామిలీ మ్యాన్‌లో సమంత పాత్ర నిలిచిపోతుంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2లో తమిళ తీవ్రవాది రాజీ పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ వెబ్ సిరీస్‌లో నటించినందుకు సమంతకు సదరు డిజిటల్ సంస్థ నాలుగు కోట్లు రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చిందని టాక్. కాగా ఇప్పుడు మరో డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సమంతతో భారీ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేయడానికి ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సమంతకు ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేశారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Tags

Next Story