అందం కంటే వ్యక్తిత్వం ముఖ్యం: సమంత

అందం కంటే వ్యక్తిత్వం ముఖ్యం: సమంత
సమంత అంటే తెలుగు, తమిళ రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అయినా ఆమె అభిమానులు సంఖ్య

సమంత అంటే తెలుగు, తమిళ రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అయినా ఆమె అభిమానులు సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పెళ్లై మూళ్లైనా, ముప్పై మూడేళ్ల వయసు పై బడినా.. ఆమె అందం మాత్రం తగ్గలేదు. చాలా మంది మీ అందానికి రహస్యం ఏంటని సమంతను అడుగుతూ ఉంటారు. కానీ, సమంత మాత్రం తాను అందంగా లేనని అంటుంది. అందరూ తనను అందంగా ఉన్నానని.. క్వీన్‌లా ఉన్నానని అందరూ అంటూ ఉంటారు కానీ.. తానేం అంత అందగత్తెను కాదని ఆమె చెబుతుంది. మేకప్ వేసుకొని మంచి కాస్ట్యూమ్‌తో కెమెరా ముందుకు వెళ్తే ప్రతీ ఒక్కరూ అందంగానే ఉంటారన సమంత అంటుంది. కాలేజీ రోజుల్లో అందంపై ఆసక్తి ఉండేదని కానీ రానురాను అది పోయిందని తెలిపింది. ఇప్పుడు ఉన్న అందం, నాజూకుదనం మరో రెండు, మూడేళ్లలో పోతాయని సమంత చెబుతుంది. కనుక అందం శాశ్వతం కాదని.. వ్యక్తిత్వం శాశ్వతమని అంటుంది. అందుకే తాను అందం గురించి పెద్దగా ఆలోచించనని తెలిపింది.

Tags

Next Story