సినిమా

Samantha: జిమ్‌లో తన వయసుకంటే డబుల్ వెయిట్‌ను ఎత్తిన సమంత..

Samantha: తన ట్రైనర్‌ను ట్యాగ్ చేస్తూ.. 75, 78, 80 కిలోల బరువును అవలీలగా ఎత్తేసింది సమంత.

Samantha: జిమ్‌లో తన వయసుకంటే డబుల్ వెయిట్‌ను ఎత్తిన సమంత..
X

Samantha: సమంత.. ప్రస్తుతం ఎక్కువగా తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మీదే దృష్టిపెడుతూ.. తనకు ఏది సంతోషాన్ని ఇస్తుందో అదే చేసుకుంటూ పోతోంది. ఒకప్పుడు సమంత రెగ్యులర్‌గా కాకపోయినా షూట్స్ మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు కచ్చితంగా జిమ్‌కు వెళ్తూ ఉండేది. కొన్నాళ్ల తర్వాత బిజీ షెడ్యూల్స్ వల్ల జిమ్‌కు , వర్కవుట్స్‌కు దూరమయ్యింది. కానీ గత కొన్నిరోజులుగా క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లకుండా అందరినీ ఆశ్చర్యపరిచే వర్కవుట్స్‌ను చేస్తోంది.

ఇటీవల 'లెవెల్ అప్' అనే కష్టమైన వర్కవుట్‌ను తొలిసారి ప్రయత్నించిన సమంత.. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించింది. ఆ ఆనందంలో మరికొందరికి ఈ లెవెల్ అప్ వర్కవుట్ చేయాలంటూ ఛాలెంజ్ విసిరింది. తాను ఛాలెంజ్ విసిరిన ముగ్గురు స్నేహితులు ఈ వర్కవుట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. తాజాగా జిమ్‌లో సమంత.. తన వెయిట్ కంటే డబుల్ వెయిట్‌ను ఎత్తి అందరూ నోరెళ్లబెట్టేలా చేసింది.

తన ట్రైనర్‌ను ట్యాగ్ చేస్తూ.. 75, 78, 80 కిలోల బరువును అవలీలగా ఎత్తేసింది సమంత. ప్రతీరోజు నేను నిన్ను డిసప్పాయింట్ చేయకూడదు అన్న ఆలోచనతోనే లేస్తాను అంటూ తన జిమ్ కోచ్‌ను ట్యాగ్ చేసింది సమంత. ఈ వెయిట్ లిఫ్టింగ్ చూసిన ప్రతీ ఒక్కరు సమంత ఏమైనా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌కు వెళ్తుందా అంటూ.. కామెడీ చేసినా.. తన బలాన్ని ప్రశంసిస్తున్నారు కూడా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ సమంత ఏజ్ ఎంతో తెలుసా.. స్వీట్ 34...

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES