Samantha In Pushpa : ఐదో పాటలో సామ్.. అదిరిపోద్దంతే..!

Samantha In Pushpa : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో సామ్ ఐటెం సాంగ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇదో ఫేక్ న్యూస్ అనుకున్నారంతా.. కట్ చేస్తే సామ్... తమ సినిమాలో ఐదో సాంగ్ చెయ్యబోతుందంటూ మేకర్స్ అఫీషియల్‌గా తెలియజేశారు. సమంతకు వెల్‌కమ్ చెబుతూ.. ఈ ఆల్బమ్‌లో ఐదో పాట అదిరిపోతుందని చెప్పుకొచ్చారు. ఈ పాట కోసం సామ్ ఏకంగా కోటి డిమాడ్ చేసిందని సమాచారం. కాగా సుకుమార్ తో రంగస్థలం, బన్నీతో s/o సత్యమూర్తి సినిమాలు చేసింది సామ్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పుష్ప ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com