Samantha: విడాకులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..

Samantha: స్టార్ హీరోయిన్ సమంత మరోసారి తన విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.వైవాహిక బంధంలో తాను పూర్తి నిజాయితీతో ఉన్నానని, అయితే అది వర్కవుట్ కాలేదని అన్నారు. శాకుంతలం ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చేస్తున్న ఇంటర్వ్యల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వివాహ బంధానికి స్వస్తిచెప్పిన కొంతకాలానికే పుష్పలో ఐటెం సాంగ్ చేసే ఆపర్ వచ్చిందన్నారు. అయితే కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధువులు, స్నేహితులు కూడా ఆ పాట చేయొద్దన్నారు. కానీ నేను దాన్ని అంగీకరించలేదు. వివాహబంధంలో 100 శాతం నిజాయితీగా ఉన్నాను. అయితే అది వర్కవుట్ కాలేదు. అలాంటప్పుడు ఎందుకు నేను బాధపడుతూ ఇంట్లో కూర్చోవాలి. చేయని నేరానికి నన్ను నేను ఎందుకు హింసించుకోవాలి అని అన్నారు. నా పరిస్థితి ఏ నటికి రాకూడదు.. నటిగా ప్రతి విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉండాలని కష్టపడుతూనే ఉంటాను. మయోసైటిస్ కారణంగా ఒక్కోసారి బొద్దుగా కనిపిస్తాను.. ఒక్కోసారి చాలా నీరసంగా ఉంటుంది. నేను స్లైల్ కోసం కళ్లద్దాలు పెట్టుకుంటున్నానని అనుకుంటున్నారు. కానీ నా కళ్లు వెలుతురును చూడలేవు. కానీ నటికి కళ్లు చాలా ముఖ్యం. భావాలన్నీ కళ్లతోనే పలికించాలి. ఎనిమిది నెలలుగా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. అన్నింటినీ దాటుకుని ఈ స్థాయికి వచ్చాను.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com