Samantha: శాకుంతలం గురించి సమంత.. అయిదు సీక్రెట్లు..

Samantha: ఓ స్టార్ హీరో సినిమా కోసం ఎదురు చూసినట్లే ప్రేక్షకులు ఆమె సినిమా కోసం కూడా ఎదురుచూస్తున్నారు. సమంత సినిమా అంటే అభిమానుల్లోనే కాదు సాధారణ ప్రేక్షకుడిలో ఏదో తెలియని ఆసక్తి. సమంత ఏ పాత్రనైన ప్రాణం పెట్టి చేస్తుంది. అందుకే ఆ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక ఆమె నటించిన శాకుంతలం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వరుసగా ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. తాజాగా సామ్ తన ఇన్‌స్టాలో ఈ సినిమాకు సంబంధించిన 5 క్రేజీ థింగ్స్‌ను షేర్ చేసుకున్నారు.
పూల అలర్జీ..
అడవిలోని అందాల నడుమ పుట్టి పెరిగిన శకుంతలకు పూల మధ్యే తిరుగుతుంది. పూలు ఎక్కువగా అలంకరించుకుంటుంది. పాత్రకు అనుగుణంగా మెడకి, చేతులకి పూలు చుట్టుకోవడంతో శరీరం మీద దద్దుర్లు వచ్చాయట. ఆరు నెలలు అలాగే ఉండిపోయాయని చెప్పింది. షూటింగ్ సమయంలో అవి కనిపించకుండా ఉండేందుకు మేకప్‌తో కవర్ చేయాల్సి వచ్చిందట.
ఒకేసారి మూడు భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లకు స్వయంగా తానే డబ్బింగ్ చెప్పింది. ఇది చాలా కష్టమైన పని నిద్రలో కూడా అవే డైలాగులు కలవరించేదాన్నని చెప్పింది.
షూటింగ్ సమయంలో తనని ఓ కుందేలు కరించిందని చెప్పింది. సెట్‌లో చాలా కుందేళ్లు ఉండేవి..
సినిమాలోని ఓ పాట కోసం దాదాపు 30 కేజీల బరువున్న లెహెంగాను ధరించాల్సి వచ్చింది. దాంతో చాలా ఇబ్బంది పడినట్లు చెప్పింది. చుట్టూ తిరిగినప్పుడు లెహెంగా బరువుకు సామ్ ఫ్రేమ్ నుంచి పక్కకు వెళ్లడంతో కెమెరా మ్యాన్ గట్టిగా అరిచేవాడట. దాంతో సమంత నేను వెళ్లడం లేదు లెహెంగానే నన్ను లాక్కుని వెళ్తోంది అని చెప్పడంతో సెట్‌లో ఉన్న అందరూ నవ్వుకునేవారట.
ఇక తన జుట్టుకు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకుంటూ.. సినిమాలో కనిపించే జుట్టు తనది కాదని చెప్పింది.
శకుంతలగా సమంత, దుష్యంతునిగా దేవ్ మోహన్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించారో చూడాలంటే మరో మూడు రోజులు ఓపిక పట్టాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com