Samantha Ruth Prabhu: పూజా హెగ్డే వర్సెస్ సమంత.. ఇందులో ఎవరికి ఎక్కువ మార్కులు..?

Samantha Ruth Prabhu: సమంత, పూజా హెగ్డే.. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోయిన్లు చేతినిండా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు కేవలం సమంత మాత్రమే పాన్ ఇండియా ఆఫర్లను దక్కించుకంటూ ఉండగా ఇప్పుడిప్పుడే పూజా హెగ్డే కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే పూజా నటించిన పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్' విడుదలకు సిద్ధమవుతుండగా.. మరో పాన్ ఇండియా మూవీ నుండి విడుదలయిన ఓ పాట నెట్టింట్లో వైరల్ అవుతోంది.
విజయ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నెల్సన్ తెరకెక్కిస్తున్న చిత్రమే 'బీస్ట్'. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నట్టు మూవీ టీమ్ ఖరారు చేసింది. షూటింగ్ కూడా పూర్తికావడంతో ప్రస్తుతం బీస్ట్ టీమ్ అంతా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. అందుకే ముందుగా ఈ సినిమాలో హీరో శివకార్తికేయన్ రాసిన 'అరబిక్ కుతు' అనే పాటను విడుదల చేశారు.
మామూలుగా ఏ స్టార్ హీరో సినిమా పాట అయినా.. మిలియన్ వ్యూస్ సాధించాలంటే కాస్త సమయం పడుతుంది. కానీ అరబిక్ కుతు పాట మాత్రం కేవలం విడుదలయిన గంటలోపే మిలియన్నర వ్యూస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా ప్రస్తుతం ఏ మ్యూజిక్ లవర్ నోట విన్న ఈ పాటే వినిపిస్తోంది. అయితే ఈ పాట కోసం హీరోయిన్ పూజా హెగ్డే తనకు తోచిన ప్రమోషన్స్ చేస్తోంది.
పూజా హెగ్డే అరబిక్ కుతు పాటలోని తన స్టెప్‌ను రీల్స్ చేయమని తన ఫాలోవర్స్‌ను కోరింది. ఫాలోవర్స్ మాత్రమే కాదు ఎవరైనా ఆ పాట మీద రీల్స్ చేయొచ్చని, అందులో తనకు నచ్చిన వాటిని తన స్టోరీలో షేర్ చేస్తానని చెప్పింది. అయితే ఇటీవల సమంత తన ఫ్లైట్ లేట్ అవ్వడంతో కాలక్షేపం కోసం ఈ పాటకు స్టెప్పులేసింది. అది చూసిన నెటిజన్లంతా సమంత, పూజా ఎవరి స్టైల్‌లో వారు బాగా చేశారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com