Samantha : సమంతకు బర్త్ డే సర్‌ప్రైజ్ ఇచ్చిన వీడీ11 మూవీ టీమ్

Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు మర్చిపోలేని విధంగా బర్త్ డే విషెస్ చెప్పింది వీడీ 11 మూవీ టీమ్. విజయ్ దేవరకొండ హీరోగా శివనిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో భాగంగా సమంత బర్త్‌డే సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు చిత్రబృందం.
ఓ సీన్ చిత్రీకరిస్తున్నట్లు టీమ్ అంతా నటించారు. సమంత కూడా నిజంగానే షూటింగ్ జరుగుతోంది అనుకుంది. కెమెరా రోల్ అవుతూ హీరోహీరోయిన్లు సీన్ చేస్తూ డైలాగ్స్ చెబుతుండగా మధ్యలో హ్యాపీ బర్త్‌డే సమంత అని విజయ్ చెప్పడంతో సమంత ఆశ్చర్యపోయింది.
టీమ్ అంతా తన కోసం ఇలా అర్థరాత్రి ఫేక్ షూట్ ప్లాన్ చేశారని తెలుసుకున్న సమంత ఎమోషనల్ అయ్యింది. షూట్‌లో ఉన్న వెన్నెల కిషోర్, దర్శకుడు శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ, ఇతర టీమ్ మెంబర్స్ సామ్ తో కేక్ కట్ చేయించి బర్త్ డే విషెస్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com