Samantha: సమంత బోల్డ్ టీ షర్ట్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Samantha (tv5news.in)
Samantha: సమంత.. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా తనదే హవా. ప్రస్తుతం సమంత ఏం చేసినా ఓ సెన్సేషన్. తను మామూలుగా అలా బయటికి వచ్చినా కూడా కెమెరాలన్నీ సమంత చుట్టూ చేరిపోవాల్సిందే. సామ్ కూడా ఆ కెమెరాలకు దిమ్మదిరిగే షాక్‌లే ఇస్తోంది. తాజాగా తాను ధరించిన ఓ టీ షర్ట్ గురించి సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా స్విట్జర్లాండ్‌లో రెండు వారాలు హాలిడేను పూర్తి చేసుకున్న సామ్.. ఇటీవల ఇండియాకు వచ్చింది. తాజాగా తాను ముంబాయిలోని ఓ సెలూన్ నుండి బయటికి రావడం గమనించిన ఫోటోగ్రాఫర్లు కొన్ని ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సమయంలో సమంత ధరించిన టీ షర్ట్.. దానిపై ఉన్న బోల్డ్ స్టేట్‌మెంట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
టీ షర్ట్‌పై ఉన్న బోల్డ్ స్టేట్‌మెంట్‌ను చూసిన నెటిజన్లు చాలామంది అదేంటి అంత బోల్డ్‌గా ఉంది అనుకుంటుంటే.. తన ఫ్యాన్స్ మాత్రం సమంత డేరింగ్ అండ్ డ్యాషింగ్ నేచర్‌కు మెచ్చుకుంటున్నారు. పైగా సింపుల్‌గా ఉన్న ఈ టీ షర్ట్ ధర ఏకంగా రూ.20,000 అని సమాచారం. సమంత ఏం చేసినా ట్రెండే అనడానికి ఈ సందర్భం ఒక ఉదాహరణగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com