Allu Sneha Reddy : బ్లాక్ శారీలో అల్లు స్నేహ.. సమంత హాట్ కామెంట్స్..!

Allu Sneha Reddy : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతిమణి అల్లు స్నేహరెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమెకి ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. తన భర్త బన్నీ, కూతురు, కొడుకుతో చేసే అల్లరి ఫోటోలను అందులో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది స్నేహ.
తాజాగా ఆమె కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు స్నేహ.. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలలో నలుపు రంగు చీరలో స్నేహ కనిపిస్తోంది. వీటిని మల్హోత్ర డిజైన్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ స్నేహకు స్టైలింగ్ చేశారు.
స్నేహ ఫోటోల పైన నెటిజన్లతో పాటుగా సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. అందులో భాగంగానే సమంత హాట్ అంటూ కామెంట్ చేసింది. కాగా సామ్ ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com