Samantha: సమంత కంటతడి.. చై కోసమేనా..!

Samantha: నాగచైతన్య, సమంత తమ విడాకుల గురించి ప్రకటించి అయిదు రోజులయినా ఇంకా ప్రేక్షకులు దానిని నమ్మలేకపోతున్నారు. టాలీవుడ్‌లో ఉన్న కొందరు అందమైన కపుల్స్‌లో చైసామ్‌కు ఫస్ట్ ప్లేస్ ఇవ్వొచ్చు. అలాంటిది వారిద్దరు ఇక రియల్ లైఫ్ కపుల్ కాదు అన్న విషయాన్ని ఎవరూ జీర్ణించులేకపోతున్నారు. అభిమానులుగా చూసేవారికే అలా ఉంటే.. మరి విడిపోయిన వారిద్దరికీ ఇంకెంత బాధగా ఉంటుందో కదా.. అందుకే సమంత కన్నీటితో తన బాధను బయటపెట్టేసింది.
విడాకుల తర్వాత చైసామ్ తమ పర్సనల్ లైఫ్‌ను దృష్టితో పెట్టుకుని ప్రొఫెషనల్ లైఫ్ నుండి కాస్త బ్రేక్ తీసుకందామనుకున్నా.. వారి కమిట్‌మెంట్స్‌తో ఇప్పుడు అది కష్టం. అందుకే సమంత వెంటనే షూటింగ్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఇటీవల హైదరాబాద్‌లో ఒక యాడ్ షూట్‌లో పాల్గొంటున్న సమంత బ్రేక్ టైమ్‌లో భావోద్వేగానికి లోనైందట. అలాగే కంటతడి కూడా పెట్టుకున్నట్టు యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
సమంత ఎవరి సాయం లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చింది. తన టాలెంట్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సినిమాలపై తనకున్న ఇష్టం వల్లే తాను ఇలాంటి సమయంలో కూడా షూటింగ్‌లలో పాల్గొనడానికి వెనకాడట్లేదు. షూట్ గ్యాప్‌లో కంటతడి పెట్టుకున్నా కూడా డైరెక్టర్ యాక్షన్ అనగానే అన్నీ మర్చిపోయే యాక్టింగ్‌లో లీనమవుతున్నట్లు యూనిట్ సభ్యులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com