Samantha: సామ్.. నువ్వెందుకింత స్ట్రాంగ్?

Samantha: హీరోలు, హీరోయిన్లు స్క్రీన్‌పైన అందంగా కనిపించడానికి ఎంతో కష్టపడతారు. ఒక్కొక్కసారి వారి పాత్ర కోసం బరువు తగ్గడం కానీ, పెరగడం కానీ అవసరం. అలాంటప్పుడే వారి ఆహార అలవాట్లు మారి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే నటీనటులు ఎప్పుడు ఫిట్‌గా ఉండడానికి ఒక పర్ఫెక్ట్ డైట్ ప్లాన్‌ను మెయింటేయిన్ చేస్తుంటారు. అందులో భాగంగానే హీరోయిన్ సమంత డైట్ ప్లాన్ ఏంటని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
సమంతకు ఎప్పటినుండైనా జిమ్‌కు వెళ్లడం, వర్కవుట్స్ చేయడం చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు తనను ఫిట్‌గా ఉంచుకోవడానికి వర్కవుట్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది సమంత. అంతే కాదు చాలావరకు ఆరోగ్యకరమైన వెజ్ ఆహారాలకే తను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. డైట్‌లో భాగంగా ఆకు కూరలను ఎక్కువగా తింటుంది.
ప్రొటీన్ ఎక్కువున్న ఆహారం తీసుకోవడం వల్ల సామ్ ఎంత బిజీ షెడ్యూల్‌లో అయినా ఎనర్జిటిక్‌గా కనిపిస్తుంది. ఒక పర్ఫెక్ట్ డైట్ ప్లాన్‌లో ఉన్నప్పుడు ఎక్కువ షుగర్ తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. అందుకే సమంత కూడా అదే ఫాలో అవుతుంది. సీజనల్ ధాన్యాలను తింటూ రైస్‌కు చాలావరకు దూరంగానే ఉంటుంది. దాని బదులు మిల్లెట్స్‌ను ఎక్కువగా తీసుకుంటుంది.
ఎప్పటికప్పుడు కొబ్బరి నీళ్లు, జ్యూస్‌లు తీసుకుంటూ హైడ్రేటెడ్‌గా ఉండడం ముఖ్యమంటుంది సామ్. ఒకవేళ ఎప్పుడైనా డైట్‌లో ఉన్నట్టు కాకుండా వేరే ఆహారాన్ని తినాలి అనిపించినా చాలా తక్కువ మోతాదులో తినేది. ఇలాంటి డైట్‌ను ఫాలో అవుతూ సమంత ఫిజికల్‌గానే కాకుండా మెంటల్‌గా కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com