Samantha : నీ వల్లే నేనిలా..: సమంత ఎమోషనల్ పోస్ట్

Samantha : నీ వల్లే నేనిలా..: సమంత ఎమోషనల్ పోస్ట్
Samantha : ఆరోగ్యం పట్ల శ్రద్ధ, సినిమా అంటే ప్యాషన్.. ఓ మంచి సినిమా చేశానన్న తృప్తి మిగలాలి.. ప్రేక్షకులు ఆదరించాలి. అందుకోసం ఎంతైనా కష్టపడుతుంది సమంత.

Samantha: ఆరోగ్యం పట్ల శ్రద్ధ, సినిమా అంటే ప్యాషన్.. ఓ మంచి సినిమా చేశానన్న తృప్తి మిగలాలి.. ప్రేక్షకులు ఆదరించాలి. అందుకోసం ఎంతైనా కష్టపడుతుంది సమంత. ఆమె నటించిన తాజా చిత్రం యశోద ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. ముఖ్యంగా అందులోని యాక్షన్ సన్నివేశాలు సామ్‌కు మంచి పేరు తీసుకువచ్చాయి. అందుకు సహకరించిన ఫిట్‌నెస్ ట్రైనర్ జునైద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది సామ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.


నాకిష్టమైన జిలేబీ తినడానికి ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ యశోద విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజు జిలేబీ తీసుకొని వచ్చాడు. గత కొన్ని నెలలుగా నా వెన్నంటి ఉండి నా చేత వ్యాయామాలు చేయించావు.


నిరాశగా ఉన్నప్పుడు, కన్నీళ్లు పెట్టుకున్న సమయాల్లో, హైడోస్ స్టెరాయిడ్ థెరపీ చేయించుకున్నప్పుడు కూడా నా వెంటే ఉన్నావు. నాతో వర్కవుట్లు చేయించావు. ఎప్పుడూ నువ్వు నన్ను వెనుకడుగు వేయనివ్వలేదు. నీవల్లే నేను ఇలా మారాను. థ్యాంక్యూ అని రాసుకొచ్చింది. ట్రైనర్ జునైద్‌ని ఆప్యాయంగా హత్తుకున్న ఫోటోను షేర్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story