Samantha : జీవితం చాలా చిన్నది.. సమంత తండ్రి ఎమోషనల్ పోస్ట్
Samantha: ప్రేమగా పెంచుకున్న కూతురు.. తనకు ఇష్టమైన రంగంలో నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. వివాహం కూడా ఆమెకు నచ్చిన వ్యక్తితోనే అయింది. సంతోషంగా సాగిపోతోందని సంబర పడ్డారు తల్లిదండ్రులు. అంతలోనే వారు జీర్ణించుకోలేని వార్త. సమంత, నాగచైతన్య విడిపోతున్నారన్న వార్త అభిమానులనే ఎంతగానో కలచి వేసింది.
ఇక తల్లిదండ్రులుగా వారికి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు వారిద్దరు విడిపోయి సంవత్సరం కావస్తోంది. అక్టోబర్ 2, 2021లో వారిద్దరూ ఒకేసారి విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సమంత తండ్రి జోసఫ్ ప్రభు పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ బాధ నుంచి బయటపడడానికి తనకు చాలా సమయం పట్టిందని ఆయన ఓ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టారు.
సామ్-చై పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ.. అప్పట్లో ఓ కథ ఉండేది.. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు కొత్త కథ.. జీవితంలో కొత్త దశ ప్రారంభించాలి అని రాసుకొచ్చారు. దీనిని చూసిన నెటిజన్లు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేస్తన్నారు. సర్.. మీ ఆవేదన మాకు అర్థమైంది.. బీ స్ట్రాంగ్ అంటూ తమ సానుభూతిని తెలిపారు. నెటిజన్లు తనపై చూపిస్తున్న అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానం, సానుభూతికి ధన్యవాదాలు. ఆ బాధ నుంచి బయటపడడానికి నాకు చాలా కాలం పట్టింది. జీవితం చాలా చిన్నది.. బాధతో కుంగిపోతూ అక్కడే ఉండిపోకూడదు అని ఆయన రాసుకొచ్చారు.
వ్యక్తిగత కారణాలతో విడిపోయిన సమంత, నాగ,చైతన్య వారి వారి ప్రాజెక్టులలో బిజీగా ఉంటున్నారు. చైతన్య గురించి అడిగితే సమంత కొంచెం ఘాటుగానే స్పందిస్తోంది. దీనిని బట్టి వారిద్దరూ విడిపోవడానికి ఏదో బలమైనా కారణమే ఉండి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ చైతన్య మాత్రం సమంత మీద అంత యాంటీగా ఉన్నట్లు అనిపించట్లేదు అతడి మాటల్లో.. సామ్ ఎదురైతే పలకరిస్తా, ప్రేమగా హత్తుకుంటా అని పాజిటివ్‌గా మాట్లాడుతున్నాడు.. ఏమో పరిస్థితులు చక్కబడితే విడిపోయిన ఇద్దరూ కలుసుకుంటారేమో.. కాలం దేన్నైనా పరిష్కరిస్తుంది. ఏదైనా జరగొచ్చు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com