Samantha : కాత్తు వాక్కుల రెండు కాదల్... ఇంట్రెస్టింగ్‌గా సామ్ లుక్ ...!

Samantha : విజయ్ సేతుపతి, నయనతార, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం కాత్తు వాక్కుల రెండు కాదల్.. ఈ సినిమాకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. దీన్ని నయనతార, విఘ్నేష్ శివన్‌ల రౌడీ పిక్చర్స్ సంస్థ, లలిత్ కుమార్‌కు చెందిన 7 స్క్రీన్స్ స్టూడియోస్ సంస్థ సంయుక్తంగా నిర్మించారు. అనిరుద్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు మేకర్స్.. అందులో భాగంగానే విజయ్ సేతుపతి మూడు ముఖాలతో కూడిన ఒక పోస్టర్‌ను, హీరోయిన్ సమంత ఫొటోతో మరో పోస్టర్‌ను ఒకేసారి విడుదల చేసి చేశారు. ఇక సినిమాని థియేటర్లోనే విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com