Samantha : సమంత ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ టైం రానే వచ్చింది..!

Samantha : పుష్ప మూవీలో ఊ ఉంటావా.. ఊ ఊ అంటావా అనే ఐటెం సాంగ్ పక్కన పెడితే సమంత మెయిన్ లీడ్‌లో సినిమా వచ్చి చాలా రోజులైంది.. జాను మూవీ 2020లో వచ్చింది. మళ్ళీ ఆమె నుంచి ఇంతవరకు సినిమా రాలేదు.. గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన శాకుంతలం మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. కానీ ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ లేదు.
అయితే ఇన్ని రోజులు వెయిట్ చేసిన సామ్ ఫ్యాన్స్‌కి మొత్తం గుడ్ న్యూస్ లభించింది. శాకుంతలం నుండి సమంత ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మూహుర్తం ఖరారైంది.. ఈ నెల 21న ఉదయం 9:30 గంటలకు సమంత యొక్క క్రేజీ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సమంత ప్రిన్సెస్ గా చాలా అందంగా కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో సమంత నటన, గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయట.
The much-awaited first look of #Shaakuntalam to be revealed on Feb 21st at 9.30 AM.#ShaakuntalamFLonFeb21@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma@neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official@tipsofficial #MythologyforMilennials #EpicLoveStory pic.twitter.com/xlIDzOeIBw
— Gunaa Teamworks (@GunaaTeamworks) February 19, 2022
గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్ రాజు దుష్యంతునిగా కనిపించనున్నాడు. అల్లు అర్జున్, స్నేహల కూతురు అర్హ ఈ చిత్రంలో నటిస్తోంది. అటు సమంత ప్రస్తుతం యశోద అనే చిత్రంలో నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com