Samantha: ప్రేమ మరింత పెరిగింది.. ఎవరిపైనో తెలుసా !!

Samantha: మానసికంగా ధృఢంగా ఉంటే శారీరక అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవచ్చు అని నిరూపించింది స్టార్ హీరోయిన్ సమంత. మయోసైటిస్ నుంచి కోలుకుని మళ్లీ తన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సిద్ధమవుతోంది. జిమ్ లో వర్కవుట్లు చేస్తూ మానసికంగా, శారీరకంగా సంసిద్ధమవుతోంది.
నువు చేస్తున్న పని నీకు మంచిది అని అనిపించినప్పుడు ఎవరో మెచ్చుకోవాలని ఎదురు చూడకు. విమర్శించే వారు ఎప్పుడూ ఉంటారు. కానీ వెన్నుతట్టి ప్రోత్సహించే వారు కొందరే ఉంటారు. అయినా కృంగిపోకుండా నిలబడాలి. తామేంటో నిరూపించుకోవాలి. ఈ విషయాన్ని గట్టిగా నమ్ముతుంది సమంత.
మరోసారి, సమంతా బ్యాక్ అండ్ షోల్డర్స్ వర్కౌట్ చేస్తున్న వీడియోను పంచుకుంది. మరోవైపు, సమంతా దానికి నేపథ్య సంగీతాన్ని జోడించింది, ఐరన్ పంపింగ్ చేస్తున్నప్పుడు మైలీ సైరస్ రాసిన 'ఫ్లవర్స్' పాట వినడం తనకు చాలా ఇష్టమని పంచుకుంది. ఈ పాట 'నేను మీ కంటే బాగా ప్రేమించగలను' అనే సాహిత్యంతో సాగుతుంది. ఆ పాట సాహిత్యం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.
మొత్తానికి, సమంత ఒక అద్భుతమైన మోటివేషనల్ వీడియోతో మనముందుకు వచ్చింది.
ఆమె అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పటికీ, సరైన ఆహారాన్ని తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు పాటిస్తుంది. మళ్లీ పూర్వపు స్థితిలోకి తన బాడీ రావాలని జిమ్ లో వర్కవుట్లు చేస్తోంది. ఆమె ప్రస్తుతం ముంబైలో తాను కొనుగోలు చేసిన కొత్త ఇంట్లో ఉంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com