Samantha: ఆమె మన మహానటి.. అగ్ర నిర్మాతల ప్రశంసలు..

Samantha: నటన అంటే నాలుగు గ్లామర్ రోల్స్ చేయడం కాదు.. నలుగురు ప్రశంసించాలి. డబ్బుల కోసం నటించకూడదు.. నటనలో జీవించాలి. నటించడం కోసమే పుట్టిందనుకోవాలి. ఇండస్ట్రీలో అలాంటి నటీనటులు వేళ్ల మీద లెక్కపెట్టేవాళ్లు ఉంటారు.
అలనాటి అభినయ తార సావిత్రికే మహనటి బిరుదు వన్నె తెచ్చింది. ఆ పాత్ర చేసి కీర్తి సురేష్ కూడా మహానటి అనిపించుకుంది. కానీ ప్రస్తుతం సినీ ఫీల్డ్‌లో మహానటి ఎవరంటే తడుముకోకుండా ఇద్దరూ ఒకే సమాధానం చెప్పారు సమంత అని.
నటుడు బాలకృష్ణ ఆహాలో చేస్తున్న షో అన్‌స్టాపబుల్. ఇందులో ఇద్దరు అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ గెస్ట్‌లుగా వచ్చారు. ప్రశ్నల పరంపరలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మహనటి ఎవరు అని అడిగారు.. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే సమాధానం రాశారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఆమె మరో మహానటి అవుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వారి సమాధానంతో సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కేవలం ఫ్యాన్సే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆమె నటనకు ఫిదా అవుతారు. ఇక ఈ వీడియోను సమంత షేర్ చేస్తూ ఇద్దరికీ ధన్యవాదాలు తెలిపింది. సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యే యశోద విడుదలై ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాంకుతలం విడుదలకు సిద్ధంగా ఉండి. విజయదేవరకొండతో ఖుషి చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com