సినిమా

Samantha: హాలీవుడ్‌లో కూడా సమంత అడుగు.. త్వరలోనే..

Samantha: తెలుగు, తమిళ సినిమాల్లో దూసుకుపోతూ సౌత్ క్వీన్‌గా వెలిగిపోతోంది సమంత.

Samantha (tv5news.in)
X

Samantha (tv5news.in)

Samantha: తెలుగు, తమిళ సినిమాల్లో దూసుకుపోతూ సౌత్ క్వీన్‌గా వెలిగిపోతోంది సమంత. ఇప్పటికే తన చేతిలో తెలుగు సినిమా 'శాకుంతలం'తో పాటు రెండు తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా బాలీవుడ్ అవకాశాల వైపు కూడా సామ్ మొగ్గుచూపుతున్నట్టు టాక్. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుంటూ తన నటనతో అందరినీ ఆకట్టుకున్న సామ్ తరువాతి అడుగు హాలీవుడ్‌లోనే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహానటి, ఓ బేబీ లాంటి సినిమాలు సమంతకు తెలుగు, తమిళంలో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఇక హిందీ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో సామ్ పాపులారిటీ ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ను చూసిన హిందీ హీరోలు సైతం ఒక్కసారి సామ్‌తో వర్క్ చేయాలని ఆశపడుతున్నారు. అంతలా బాలీవుడ్‌పై తన మ్యాజిక్‌ను చూపించింది సమంత.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌ను కవర్ చేసిన సమంత నెక్స్ట్ ఎంట్రీ హాలీవుడే అని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. 'అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌' అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఇంగ్లీష్ సినిమాలో సమంత హీరోయిన్‌గా ఎంపికయినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఫిలిప్‌ జాన్‌ అనే హాలీవుడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

డైరెక్టర్ హాలీవుడ్ అయినా.. ఈ సినిమా నిర్మాతలు మాత్రం టాలీవుడ్‌కు చెందినవారే. 'అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌'ను గురు ఫిల్మ్స్‌ సమర్పణలో సునీత తాటి నిర్మిస్తున్నారని టాక్. ఇదివరకు సమంత నటించిన 'ఓ బేబి' చిత్రాన్ని కూడా ఇదే సంస్థ నిర్మించింది.

ఇండియన్‌ రైటర్‌ టైమెరి ఎన్. మురారి రాసిన నవలే 'అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌'. దీనిని బ్రిటిష్‌-శ్రీలంక నటి నిమ్మి హర్‌స్గామా పబ్లిక్ చేశారు. 2004లో విడుదలైన ఈ నవల అత్యధిక అమ్ముడైనదానిగా రికార్డ్ సాధించింది. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు టొరంటో ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ఫోరమ్‌కు ఎంపికైనా ఏకైకా ఇండియన్ నవలగా కూడా ఈ పుస్తకానికి రికార్డ్ దక్కింది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES