అభిమానులు ఖుష్.. సామ్ వస్తోంది..

అభిమానులు ఖుష్.. సామ్ వస్తోంది..
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం “కుషి” ప్రమోషన్స్ లో పాల్గొనడానికి సిద్దమవుతున్నాడు.

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం “కుషి” ప్రమోషన్స్ లో పాల్గొనడానికి సిద్దమవుతున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సమంత ప్రమోషన్స్ లో పాల్గొంటుందా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. సినిమాల నుండిసామ్ ఒక సంవత్సరం పాటు విరామం ప్రకటించినందున మరి ప్రమోషన్స్ కి వస్తుందో రాదో అని అందరికీ సంశయం. ఆమె మయోసైటిస్ చికిత్స కోసం USAకి వెళుతుందని చాలా మంది భావించారు. కానీ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూనే తన ఆప్తమిత్రులను కలుస్తోంది.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న సినిమా విడుదల కానున్న ఖుషి ప్రమోషనల్ ఈవెంట్స్‌లో తాను పాల్గొంటానని నిర్మాతలకు సామ్ క్లారిటీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆమె ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరవుతుంది. కొన్ని ప్రీ-రికార్డ్ ఇంటర్వ్యూ సెషన్స్ లో కూడా పాల్గొంటుంది అని టాక్. ఇంకేం నిర్మాతలకు సగం టెన్షన్ తీరినట్లే. సమంత ప్రమోషన్స్ సినిమాకు కొంత ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు మేకర్స్.

Tags

Read MoreRead Less
Next Story