16 ఏళ్ల వయసులో.. సమంత ఇన్‌స్టా పోస్ట్ వైరల్

ఏప్రిల్ 28న సమంత తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె తన 16 సంవత్సరాల వయస్సులో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో ఆమె మరింత అందంగా కనిపిస్తోంది. ఎప్పటిలాగే స్టైలిష్‌గా చిరునవ్వును ప్రదర్శిస్తోంది. ఆమె "నాకు అప్పుడు 16 ఏళ్లు'' అlr పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సమంత ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలిచింది.
వరుసగా రెండు బాక్సాఫీస్ ఫ్లాప్‌ల తర్వాత విజయ్ దేవరకొండతో నటించిన ఖుషి చిత్రం కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించిన సమంత కావలసినంత వ్యతిరేకతను మూటగట్టుకుంది. మరి పుష్ప ది రూల్‌లో కూడా నర్తిస్తుందా లేదా అన్న విషయం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం సమంత సిటాడెల్ ప్రాజెక్టులో బిజీగా ఉంది. తన ఆరోగ్యం కుదుట పడడంతో సినిమాలపై దృష్టి పెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com