Samantha: 'యశోద' ప్రమోషన్ కోసం సుమతో సమంత

Samantha: యశోద ప్రమోషన్ కోసం సుమతో సమంత
Samantha: ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంతకు ఏమైంది. సోషల్ మీడియాలో అందుబాటులో లేకపోయే సరికి ఆమె గురించి అభిమానుల ఎంక్వైరీ..

Samantha: ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంతకు ఏమైంది. సోషల్ మీడియాలో అందుబాటులో లేకపోయే సరికి ఆమె గురించి అభిమానుల ఎంక్వైరీ.. ఏదో వ్యాధితో బాధపడుతోంది అని, చికిత్స కోసం అమెరికా వెళ్లింది అని ఎన్నో వార్తలు.. నిజం నిలకడ మీద తెలుస్తుంది అని నిజంగానే ట్రీట్ మెంట్ తీసుకున్న తరువాత.. తాను ఎందుకు ఇన్ని రోజులు మీడియాకు దూరంగా ఉన్నాను.. తనకు వచ్చిన వ్యాధి ఏంటి అని వివరాలు వెల్లడిస్తూ పోస్ట్ పెట్టింది. దాంతో అభిమానులతో పాటు సెలబ్రెటీలు సైతం ఆమె త్వరగా కోలుకొని తిరిగి సినిమాల్లో నటించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబరు 11న సమంత నటించిన చిత్రం యశోద రిలీజ్ కానుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సినిమాని ప్రమోట్ చేయడానికి అంత అనారోగ్యంలోనూ సమంత సిద్ధపడింది. సుమకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ వీడియో ఇంటర్వ్యూలో ఆమె 'యశోద' సినిమాలో నటించడానికి గల కారణాలు వివరించింది. దీంతో పాటు ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. సమంతకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉంది. ఆమెకు ఇంకా చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ, ఆమె ఈ ఇంటర్వ్యూను రికార్డ్ చేయగలిగింది. ఇంటర్వ్యూలో, ఆమె తన ఆరోగ్య సమస్యను ఎంత ధైర్యంగా ఎదుర్కొంటుందో చర్చించింది.


Tags

Read MoreRead Less
Next Story