సినిమా

Samantha: మరోసారి చేయి కలపనున్న హిట్ కాంబినేషన్.. ఈసారి లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఖాయం..!

Samantha: సమంత, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి.

Samantha: మరోసారి చేయి కలపనున్న హిట్ కాంబినేషన్.. ఈసారి లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఖాయం..!
X

Samantha: దర్శకులకు ఒక్కసారి ఒక హీరో లేదా హీరోయిన్ యాక్టింగ్ నచ్చితే చాలు.. వారితోనే మళ్లీ మళ్లీ సినిమా చేయాలని ఆశిస్తూ ఉంటారు. అలా హీరో, హీరోయిన్లను వరుసగా రిపీట్ చేసిన డైరెక్టర్లు ఎందరో.. తాజాగా తనకు లక్ తీసుకొచ్చిన హీరోయిన్‌తోనే మరోసారి కలిసి పనిచేయాలనుకుంటున్నాడట మాటల మాంత్రికుడు. తనెవరో కాదు.. సమంత రుత్ ప్రభునే.

సమంత, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి. మందుగా పవన్ కళ్యాణ్‌తో చేసిన 'అత్తారింటికి దారేది'లో సమంతకు మొదటిసారి ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. అందులో తన నటనకు ఇంప్రెస్ అయిన మాటల మాంత్రికుడు.. ఆ తర్వాతే నితిన్‌తో చేసిన 'అఆ'లో కూడా తననే హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. ఇక వీరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా 'సన్నాఫ్ సత్యమూర్తి'.

సమంత తరువాత పూజా హెగ్డేతో వరుసగా సినిమాలు చేశాడు త్రివిక్రమ్.. ఇప్పుడు మరోసారి సమంతతో ఓ డిఫరెంట్ స్టోరీని తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే మహేశ్‌తో సినిమా అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్.. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు సందేహంలో పడింది. మహేశ్‌ కాకపోతే ఎన్‌టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నాడు కానీ అది కూడా వర్కవుట్ అయ్యేలా లేదు.

మహేశ్, ఎన్‌టీఆర్‌తో సినిమాలు కుదరకపోయే సరికి తన లక్కీ ఛార్మ్ సమంతతో సినిమా చేయాలని మాటల మాంత్రికుడు డిసైడ్ అయినట్టు టాలీవుడ్‌లో రూమర్ వైరల్ అయ్యింది. ప్రస్తుతం వరుస లేడీ ఓరియెంటెడ్, పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న సమంత.. మరోసారి తన హిట్ దర్శకుడితో చేతులు కలిపి ఫస్ట్ టైమ్ ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తే చూడాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES