సినిమా

Samantha Item song : సమంత ఐటెం సాంగ్ పుష్ప సినిమాకి ప్లస్సా? మైనస్సా?

Samantha Item song : మొదటి సినిమా ఆర్యలో అ అంటే అమలాపురం నుంచి నిన్న వచ్చిన పుష్పలో ఉ అంటావా మావా వరకు ప్రతి ఐటెం సాంగ్ క్లిక్ అయింది.

Samantha Item song : సమంత ఐటెం సాంగ్ పుష్ప సినిమాకి ప్లస్సా? మైనస్సా?
X

Samantha Item song : సుకుమార్ సినిమా అంటేనే పక్కాగా ఐటెం సాంగ్ ఉంటుంది. మొదటి సినిమా ఆర్యలో అ అంటే అమలాపురం నుంచి నిన్న వచ్చిన పుష్పలో ఉ అంటావా మావా వరకు ప్రతి ఐటెం సాంగ్ క్లిక్ అయింది. అయితే మిగతా ఐటెం సాంగ్స్ కి పుష్పలో ఐటెం సాంగ్ కి చాలా తేడా ఉంది.. ఎందుకంటే సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఈ ఐటెం సాంగ్ చేసింది. దీనితో పుష్పకి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది.

క్రేజ్ తో పాటుగా వివాదాలు కూడా అంతేస్థాయిలో వచ్చాయి. పురుషులను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయని ఆంధ్ర,తమిళ పురుష సంఘాలు వ్యతిరేకించాయి. సినిమా నుంచి ఈ పాటను తీసేయాలని డిమాండ్ చేశాయి. దీనితో పుష్ప మూవీ వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ సామ్ ఐటెం సాంగ్ చేయడం సినిమాకి ప్లస్ అయిందా లేదా మైనస్ అయిందా?

ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ అంటే అటెన్షన్ మాములుగా ఉండదు.. మళ్ళీ అందులోనూ విడాకుల తర్వాత స్క్రీన్ పైన సామ్ కనిపిస్తోన్న మొదటి సినిమా ఇదే.. దీనితో పుష్ప మూవీ పై, ఆ పాట పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సింగర్, లిరిక్స్ నుంచి కోరియోగ్రఫీ, వీడియో వరకు ప్రతిఒక్కదాన్ని ఫాలో అయ్యారు ప్రేక్షకులు.

మిగతావి ఎలా ఉన్న లిరిక్స్ పురుషుల భావాలు దెబ్బతిన్నాయంటూ కేసు వేయడంతో పాటకి మరింత క్రేజ్ పెరిగింది. ఈ వివాదం సినిమాకి కలెక్షన్లు, క్రేజ్ అయితే తెచ్చిపెట్టింది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని సినిమాకి, పాటకి దూరం చేసింది.Next Story

RELATED STORIES