Samantha : మరో ఐటెం సాంగ్ కి సమంత గ్రీన్ సిగ్నల్..!

Samantha (tv5news.in)
Samantha : సమంత ఇప్పుడు సినిమాల పైన ఫోకస్ పెట్టింది.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌లో బిజీ అయిపోతుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో గతేడాది వచ్చిన పుష్ప మూవీలో 'ఊ అంటావా మావ' అనే ఐటెం సాంగ్‌లో సామ్ తలుక్కున మెరిసిన సంగతి తెలిసిందే. సమంత ఆ పాట చేయడం సినిమాకి పెద్ద ప్లస్ అయిందని చెప్పాలి. ఈ పాటకి యూట్యూబ్‌లో 73 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.
ఇదిలావుండగా ఇప్పుడు మరో ఐటెం సాంగ్‌కి సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాని చార్మీ, కరణ్ జోహార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం మేకర్స్ సమంతని సంప్రదించారట.. విజయ్ దేవరకొండ సైతం తనకున్న చనువుతో ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారని టాక్ వినిపిస్తోంది. దీనితో సమంత కూడా ఐటెం సాంగ్ కి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా సమంత, విజయ్ కలిసి మహానటి చిత్రంలో నటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com