Samantha: సమంత ఛాలెంజ్ విసిరింది.. ప్రీతమ్ ఫెయిల్ అయ్యాడు..

Samantha: ఒకప్పుడు జిమ్‌లో ఎక్కువ సమయాన్ని గడిపే సమంత.. ఇటీవల కాలంలో జిమ్ వైపు చూడడం తగ్గించేసింది. అందుకే తన షెడ్యూల్‌లో మళ్లీ జిమ్‌ను యాడ్ చేసుకుంది. రోజూ కచ్చితంగా వర్కవుట్స్ చేయడమే కాకుండా అవి తన ఫాలోవర్స్‌తో కూడా పంచుకుంటోంది. తాజాగా ఓ డిఫరెంట్ వర్కవుట్‌ను ట్రై చేసిన సమంత.. తన ఫ్రెండ్స్‌ను కూడా అది ట్రై చేయమని ఛాలెంజ్ చేసింది.
సమంత.. ఎప్పటికప్పుడు ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటూ, డైట్ మెయింటేయిన్ చేస్తూ ఉంటుంది. తన తోటివారిని కూడా అలా ఉండమని ప్రోత్సహిస్తుంటుంది. కానీ గతకొంతకాలంగా షూటింగ్స్‌తో, వ్యక్తిగత ఇబ్బందులతో జిమ్‌కు దూరంగా ఉన్న సమంత.. న్యూ ఇయర్ నుండి రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్లడం ప్రారంభించింది. అందుకే భాగంగానే 'లెవల్ అప్' అనే ఓ కొత్త వర్కవుట్‌ను చేసి, తన ఫ్రెండ్స్ కూడా అది చేయాలంటూ ఛాలెంజ్ చేసింది.
లెవెల్ అప్ వర్కవుట్ ఛాలెంజ్‌ను తన స్నేహితులు హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్, మేకప్ ఆర్టిస్ట్ రంభియా, ప్రీతమ్ జుకల్కర్‌కు విసిరింది సమంత. వీరిలో ఏ ఒక్కరు కూడా ఛాలెంజ్‌ను పూర్తి చేయలేకపోయారు. పైగా ఈ ఛాలెంజ్ కోసం వీరు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com