Samantha: ఆ వస్తువుపై ప్రేమ పెంచుకున్న సామ్.. చాలా బాధగా ఉందంటూ పోస్ట్..

Samantha (tv5news.in)
Samantha: కొన్ని కొన్ని వస్తువులకు మనుషులు చాలా దగ్గరయిపోతుంటారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత మనుషులకు అన్నింటికంటే ఎక్కువగా ఇష్టమైన వస్తువు స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్ అనేది కనిపెట్టక ముందు మామూలుగా కీప్యాడ్ ఫోన్లు అందుబాటులో ఉండేవి. అప్పట్లో ఫోన్లు ఉపయోగించేవారి సంఖ్య ఎక్కువగా ఉండకపోయినా కూడా.. కొన్ని ఫోన్లు మాత్రం మనకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. అందులో ఒకటి బ్లాక్‌బెర్రీ.
బ్లాక్‌బెర్రీ కీ ప్యాడ్ ఫోన్లు అప్పట్లో చాలా సెన్సేషన్‌నే క్రియేట్ చేశాయి. కీబోర్డ్ లాంటి కీప్యాడ్‌తో వచ్చిన ఏకైక ఫోన్ మోడల్ బ్లాక్‌బెర్రీ. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత కూడా బ్లాక్‌బెర్రీ ఫోన్లనే ఇష్టంగా కొన్నవారు చాలామందే ఉన్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు కోట్ల మంది యూజర్లను అలరించింది ఈ బ్లాక్‌బెర్రీ ఫోన్. అయితే 2016లో ఈ తరహా కీప్యాడ్‌ల ఫోన్లను తయారు చేయడం ఆపేసింది బ్లాక్‌బెర్రీ.
తాజాగా సొంత ఓఎస్ ఫోన్లు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండవంటూ బ్లాక్‌బెర్రీ ప్రకటించింది. దీంతో బ్లాక్‌బెర్రీ పూర్తిగా టెక్నాలజీ వరల్డ్‌కు గుడ్‌బై చెప్పేసింది. దీంతో సమంత కూడా తాను కూడా ఒకప్పుడు బ్లాక్‌బెర్రీ యూజర్‌ను అని గుర్తుచేసుకుంటూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. బ్లాక్‌బెర్రీ సర్వీస్ అయిపోయింది అన్న ఫోటోను షేర్ చేస్తూ.. 'ఎందుకో తెలీదు నన్ను ఇది చాలా బాధపెడుతుంది' అన్న క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది సమంత.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com