Samantha: ప్రేమకథల నుండి పీరియాడిక్ సినిమాల వైపు సామ్.. అప్పుడు శాకుంతలం.. ఇప్పుడు..

samantha (tv5news.in)
Samantha: ప్రస్తుతం సౌత్‌లో ఉన్న హీరోయిన్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో దూసుకుపోతోంది సమంత. లేడీ ఓరియెంటెడ్ సినిమా కథలను సెలక్ట్ చేస్తూ.. ఒకవేళ కమర్షియల్ సినిమాలు అయినా అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఒప్పుకుంటోంది. అంతే కాకుండా ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప' సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుని అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా మరో షాకింగ్ ప్రాజెక్ట్‌తో అందరి ముందుకు రానుంది.
సమంత కెరీర్‌లో ఇప్పటివరకు ప్రేమకథల్లోనే ఎక్కువగా నటించింది. అందువల్లే తనకు పేరు వచ్చింది కూడా. కానీ గత కొంతకాలంగా ప్రేమకథలను పక్కన పెట్టి తన మనసుకు నచ్చిన కథల వైపు అడుగులేస్తోంది. కమర్షియల్ సినిమాలను పూర్తిగా దూరం పెట్టేసింది. లేడీ ఓరియెంటెడ్ కథలతో హిట్స్ కొట్టేస్తోంది. తాజాగా పాన్ ఇండియా చిత్రాలను కూడా సైన్ చేస్తోంది.
ఇప్పటికే సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే మైథలాజికల్ సినిమాలో నటిస్తోంది. అందులో ఆమె టైటిల్ పాత్రలో, శకుంతలగా నటించనుంది. ఈ సినిమా గురించి ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా గుణశేఖర్ దీనిని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించారు. ఇటీవల శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్ మరో మైథలాజికల్ పాన్ ఇండియా స్టోరీని లైన్‌లో పెట్టింది.
శ్రీదేవి మూవీ బ్యానర్స్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న 'యశోద' సినిమాలో సమంత హీరోయిన్‌గా చేయడానికి ఒప్పుకుంది. ఈ సినిమా గురించి మేకర్స్ ఇంతకు ముందే ప్రకటించినా.. తాజాగా ఈ చిత్రం సైలెంట్‌గా షూటింగ్‌ను మొదలుపెట్టి టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతే కాకుండా ఇది ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని మేకర్స్ వెల్లడించారు.
శాకుంతలం లాగా యశోద కూడా ఓ పీరియాడిక్ డ్రామా అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. దీనికి హరి, హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా పాటల పల్లకిని రామజోగయ్య శాస్త్రి మోస్తే.. మాటల అల్లికను పులగం చిన్నారాయణ, డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com