Samantha : పుష్పలో ఐటెం సాంగ్ కోసం ఎంత కష్టపడ్డానంటే : సమంత

Samantha : సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో తాజాగా వచ్చిన మూవీ పుష్ప.. భారీ వసూళ్లతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. మత్తు వాయిస్‌తో ఉ అంటావా మావా ఊ ఊ అంటావా సాగే ఈ పాట శ్రోతల చేత వన్స్ మోర్ అనిపిస్తోంది. ధియేటర్లో కూడా ఈ పాటకి మాములు క్రేజ్ లేదు. చంద్రబోస్ ఈ పాటకి లిరిక్స్ అందించగా.. ఇంద్రావతి చౌహాన్ ఈ పాటను ఆలపించారు. దేవి మ్యూజిక్ అందించాడు. అయితే ఈ పాట పై సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. "నేను బాగా చేశాను.. నేను చెడుగా చేశాను..నేను ఫన్నీగా ఉన్నాను, నేను సీరియస్‌గా ఉన్నాను, నేను చాట్ షో హోస్ట్‌ని కూడా.. నేను తీసుకునే ప్రతిదానిలో రాణించడానికి నేను చాలా కష్టపడుతున్నాను. ..కానీ సెక్సీగా ఉండటం నెక్స్ట్ లెవెల్ హార్డ్ వర్క్" అంటూ పోస్ట్ చేసింది. అటు ఓ ఇంటర్వ్యూలో ఇదే పాట పై స్పందిస్తూ.. ఈ పాటలో భాగమైనందుకు సంతోషంగా ఉందని, బన్నీతో కలిసి స్టెప్స్ వేయడం ఓ సవాల్ గా అనిపించింది అని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com