సినిమా నుంచి సమంత అవుట్, కొత్త హీరోయిన్ కావాలి

సినిమా నుంచి సమంత అవుట్, కొత్త హీరోయిన్ కావాలి
సమంత రూత్ ప్రభు తన పని నుండి 1-సంవత్సరం విరామం ప్రకటించినప్పటి నుండి, ఆమె సోషల్ మీడియా లెన్స్‌తో సహా అందరి దృష్టిలో పూర్తిగా దూరమవుతుందని చాలా మంది భావించారు

సమంత రూత్ ప్రభు తన పని నుండి 1-సంవత్సరం విరామం ప్రకటించినప్పటి నుండి, ఆమె సోషల్ మీడియా లెన్స్‌తో సహా అందరి దృష్టిలో పూర్తిగా దూరమవుతుందని చాలా మంది భావించారు. అయితే నటి తన పర్యటనల వివరాలను పంచుకోవడంలో బిజీగా ఉంది.

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించనున్న ఓ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తుందని గతంలో భావించారు. మైయోసైటిస్‌కు సమంత ఒక సంవత్సరం విరామం తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె ఈ సినిమా చేయదని అందరూ భావించారు. అయితే, ఆమె బ్యాక్ టు బ్యాక్ వెకేషన్ ఫోటోలను పోస్ట్ చేయడంతో అభిమానులు ఆమె సినిమా సెట్స్‌కి తిరిగి వస్తుందనే ఆశలు పెట్టుకున్నారు.

కానీ ఆమె సినిమా షూటింగుల నుండి ఒక ఏడాదిపాటు బ్రేక్ తీసుకోవాలని కచ్చితంగా నిర్ణయించుకుంది. దీంతో నందినీ రెడ్డి మరో హీరోయిన్ ని వెతుక్కోక తప్పని పరిస్థితి. సిద్దూ సరసన నిత్యామీనన్ లేదా మాళవికా నాయర్ ని అనుకుంటున్నట్లు సమాచారం.

మరోవైపు, సిద్ధు జొన్నలగడ్డ తాను రాసిన డీజే టిల్లు సీక్వెల్ టిల్లూ స్క్వేర్‌కు ఇంకా తుది మెరుగులు దిద్దుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని చాలా సార్లు పోస్ట్ పోన్ చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story