Nani Dasara Movie: నేచురల్ స్టార్ సినిమాలో సమంత కీ రోల్..

Nani Dasara Movie (tv5news.in)
Nani Dasara Movie: సమంత.. ఈతరం హీరోయిన్లలో ఒక ప్రామిసింగ్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకున్న నటి. తన నటనతో మనల్ని నవ్వించడమే కాదు.. తనతో ప్రేమలో కూడా పడేలా చేయగలదు. తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి సమంత ఎప్పుడు పరిమితులు పెట్టుకోలేదు. అందుకే సౌత్‌లో విపరీతమైన క్రేజ్‌ను, ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. క్యారెక్టర్ బాగుంటే హీరోయిన్‌గా కాకపోయినా సైడ్ క్యారెక్టర్ చేయడానికి అయిన సామ్ సిద్ధమైపోతుంది. తాజాగా నేచురల్ స్టార్ సినిమాలో సమంత ఒక కీ రోల్‌లో కనిపించనుందన్న వార్త వైరల్‌గా మారుతోంది.
సంవత్సరానికి కనీసం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఒకే ఒక్క హీరో నేచురల్ స్టా్ర్ నాని. ఇప్పటికే నాని ఖాతాలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో శ్యామ్ సింగరాయ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమాను ప్యాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించింది మూవీ టీమ్. అంతే కాక ఒక పాటతో శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
లైన్‌లో సినిమాలు సెట్స్‌పై ఉండగానే నాని ఇటీవల తన కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. 'దసరా' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీకాంద్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇందులో నాని ముందెన్నడు లేని రఫ్ లుక్‌లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు.
దసరా చిత్రంలో నానికి జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరు కలిసి 'నేను లోకల్' సినిమాతో మెప్పించారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత కూడా ఓ కీ రోల్‌లో కనిపించనుందని కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీని గురించి మూవీ యూనిట్ ఏం వెల్లడించకపోయినా హిట్ పెయిర్ అనిపించుకున్న నాని, సమంత మళ్లీ కలిసి నటిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com