Samantha : సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ .. 'కోరుకున్నవన్నీ దక్కాలంటే'..!

Samantha : టాలీవుడ్‌లో ఇప్పటకీ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది సమంత.. నాగచైతన్యతో విడాకుల తర్వాత సామ్ క్రేజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. లేటేస్ట్ ఫోటోస్, మోటివేషనల్ కోట్స్, మూవీ అప్డేట్స్‌తో అభిమానులకి ఎప్పుడు టచ్ లోనే ఉంటోంది. సామ్ ఏదైనా పోస్ట్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ కొటేషన్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
"డిసిప్లెన్‌గా ఉండాలని ఒకరు చెప్పాల్సిన పనిలేదు, క్రమశిక్షణ మనల్ని బలంగా తయారుచేస్తుంది. క్రమశిక్షణతో ఉంటే తాత్కాలిక ఆనందాలు దక్కకపోయినప్పటికీ.. మున్ముందు అంతకుమించిన ఫలితాలు దరికి చేరతాయి. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇదే పునాది కూడా. మీరు కోరుకున్నవన్నీ మీకు ఇచ్చేంతగా మిమ్మల్ని మీరు ప్రేమించడం కూడా తప్పనిసరి" అంటూ పోస్ట్ చేసింది సామ్.
క్రమశిక్షణ అనేది ఎదుగుదలకి ఎంతగా ఉపయోగపడుతోందో ఈ కొటేషన్ ద్వారా చెప్పింది సామ్.. ఇక సమంత సినిమాల విషయానికి వచ్చేసరికి గతేడాది అల్లు అర్జున్ పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో కంప్లీట్ చేసిన 'శాకుంతలం' మూవీ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ప్రస్తుతం సామ్ యశోద చిత్రంతో పాటుగా ఓ హాలీవుడ్ మూవీ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com