Samantha : ఆ పసిప్రాయమే... 14ఏళ్ల తర్వాత ధైర్యంగా తిరిగి వచ్చింది

Samantha : ఆ పసిప్రాయమే... 14ఏళ్ల తర్వాత ధైర్యంగా తిరిగి వచ్చింది
వైరల్ అవుతోన్న సామ్ పోస్ట్.. 14ఏళ్ల కిందటి సన్నివేశాలను గుర్తు చేసుకున్న సమంత

మయోసైటిస్ వ్యాధి ప్రభావిత లక్షణాలకు చికిత్స కోసం ఇటీవలే అమెరికా వెళ్లిన స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడు న్యూయార్క్ సిటీలో ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు కూడా ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. రీసెంట్ గా అక్కడి ఏటా గ్రాండ్ గా జరిగే ఇండియా డే పరేడ్ వేడుకల్లో పాల్గొంది. ఆమెతో పాటు ఈ వేడుకలకు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈ సెలబ్రేషన్స్ కు హాజరయ్యారు. అయితే తాజాగా సామ్ షేర్ చేసిన ఓ పోస్టు ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. న్యూయార్క్ రావాలాని చాలా మంది కలలు కంటూ ఉంటారు. నేను మొదటి సినిమా షూటింగ్ ను ఇక్కడే చేసి కెరీర్ ను ప్రారంభించాను. అసలు ఎలా సాధిస్తానన్న చిన్న క్లూ కూడా లేకుండా వచ్చిన ఆ చిన్న అమ్మాయి.. 14ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓ పెద్ద కల కనేంత ధైర్యంతో ఉంది అని ఆమె తన ఇన్ స్టా పోస్టులో రాసుకువచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.

ఇటీవల న్యూయార్క్ డే పరేడ్ వేడుకల్లో పాల్గొన్న సామ్.. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంత గొప్పవనేవి తాను చూసిన దృశ్యాలు మరోసారి అర్థమయ్యేలా చేశాయని చెప్పింది. ఈ మూమెంట్స్ తన మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయని, ఈ అరుదైన గౌరవం దక్కినందుకు థ్యాంక్యూ అని చెప్పింది. తన సినిమాలను ఆదరిస్తున్న అమెరికన్ ప్రజలకు కూడా ఆమె ఈ సందర్ఙంగా ధన్యవాదాలు తెలియజేసింది.

సామ్ ఏం మాయ చేశావేతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరో నాగ చైతన్య సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సమంత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సినిమాను ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరించే సామ్ శైలి, జాగ్రత్తలే ఈ రోజు ఆమెను స్టార్ హీరోయిన్ స్థాయికి తీసుకువెళ్లాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వ్యక్తిగత జీవితంలో మానసిక సంఘర్షణలకు తోడు అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న సామ్ ను స్ఫూర్తినిచ్చే నటీమణుల్లో ఒకరిగా చూడవచ్చు.

ఇదిలా ఉండగా సమంత ఇటీవలి కాలంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి'లో నటించింది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ కన్సర్ట్ ఈ మధ్యే జరగగా.. ఈ ఈవెంట్ లో విజయ్, సామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేజ్ మీద షర్ట్ విప్పడం, సమంతను ఎత్తుకుని గిరగిరా తిప్పడం, సమంత, విజయ్ స్పీచులు ఇలా అన్నీ కూడా ఖుషి మీద బజ్‌ను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం 'ఖుషి' టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా.. మరి సమంత ఈ ప్రమోషన్స్ లో పాల్గొననుందా.. లేదంటే అమెరికాలోనే ఉండనుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా 'ఖుషి' సెప్టెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ కానుంది.


Tags

Read MoreRead Less
Next Story