Samantha: నాగచైతన్య సినిమాపై సమంత పోస్ట్.. మూడేళ్లు అయ్యిందంటూ..

Samantha: టాలీవుడ్‌లోని మెస్ట్ క్యూట్ కపుల్స్‌లో ఒకరు సమంత, నాగచైతన్య. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు మ్యుచువల్ ఫ్యాన్స్ చాలా సంతోషించారు. కానీ కొన్నేళ్లకే మనస్పర్థలతో సమంత, నాగచైతన్య విడిపోయారు. ప్రస్తుతం ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే సమంత పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
సమంత, నాగచైతన్య కలిసి అయిదు సినిమాల్లో నటించారు. వీరిద్దరు పెళ్లి తర్వాత కూడా శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' అనే సినిమాలో మెరిసారు. అప్పట్లో రియల్ లైఫ్ కపుల్ అయిన నాగచైతన్య, సమంత.. మజిలీలో రీల్ లైఫ్ కపుల్‌గా ఎలా ఉంటారో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. అయితే నేటికి మజిలీ విడుదలయ్యి మూడేళ్లు అయ్యింది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత.. తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పోస్టుల ద్వారా ఫాలోవర్స్‌కు తెలియజేస్తూనే ఉంటుంది. తాజాగా మజిలీ విడుదలయ్యి మూడేళ్లు కావడంతో.. '3 ఇయర్స్ ఫర్ మజిలీ' అంటూ ఇన్‌స్టా్గ్రామ్‌లో స్టోరీ పెట్టింది సమంత. ఇది చూసిన అభిమానులు మళ్లీ వీరు కలిసిపోతే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. లేదా వీరిద్దరు కలిసి మళ్లీ సినిమాల్లో నటించినా చాలు అనుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com