Samantha Ruth Prabhu: ఛీ.. ఛీ.. ఏంటా డ్రెస్.. ఏంటా యాడ్: సమంతపై నెటిజన్స్ ట్రోల్స్

Samantha Ruth Prabhu: సమంత సింగిల్ గా లైఫ్ ని లీడ్ చేస్తోంది.. వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది. ఏ యాడ్ లో నటించడానికైనా సిద్ధమే అంటూ సిగ్నల్స్ పాస్ చేస్తున్న సామ్ ని చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.. తాజాగా ఆమె నటించిన బ్లెండర్స్ ప్రైడ్ ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ ఓ ప్రకటనలో నటించింది.
ఈ వీడియోలో సామ్ కొంచెం బోల్డ్ గా కనిపించింది. దీంతో సామ్ ని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.. స్టార్ హీరోయిన్ అన్న విషయం మర్చిపోయి డబ్బు కోసం ఇలాంటి ప్రకటనల్లో నటిస్తావా అని ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇది వరకు ఇలాంటి యాడ్స్ లో నటించిన హీరో హీరోయిన్లపై ఇదే విధమైన విమర్శలు వచ్చాయి.
అవన్నీ తెలిసి కూడా సామ్ ఇలా చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు సమంత అభిమానులు సైతం. ఛీ ఛీ డబ్బు కోసం ఇంతగా దిగజారుతారా.. టాప్ హీరోయినై ఉండి ఆల్కహాల్ ప్రమోట్ చేస్తావా అని ట్రోల్ చేస్తున్నారు.
దీనికి తోడు ఆ ప్రకటనలో ఆమె డ్రెస్ కూడా ఒకింత ఇబ్బంది కరంగా ఉంది. దాంతో ఆమె డ్రెస్సింగ్ సెన్స్ పై కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమంత అవన్నీ పట్టించుకుంటే కష్టమనుకుందో ఏమో.. తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com