Samantha: ఎదగండి.. మీ పనిపై దృష్టి పెట్టండి: తనపై వస్తున్న ట్రోల్స్ పై సమంత రియాక్షన్

Samantha: ఎదగండి.. మీ పనిపై దృష్టి పెట్టండి: తనపై వస్తున్న ట్రోల్స్ పై సమంత రియాక్షన్
Samantha: సమంత, నాగచైతన్య ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నా ఎక్కువగా సమంత నెటిజన్స్ చేతిలో ట్రోల్స్ కి గురవుతుంటుంది..

Samantha: సమంత, నాగచైతన్య ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నా ఎక్కువగా సమంత నెటిజన్స్ చేతిలో ట్రోల్స్ కి గురవుతుంటుంది.. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఆమెకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. అయితే వాటిపై అంతగా రియాక్ట్ కాకపోయినా అబ్బాయిలు, అమ్మాయిలపై వేరు వేరుగా చూపిస్తున్న వివక్షను మాత్రం సహించలేకపోతోంది..

తాజాగా నాగచైతన్య ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్న గత కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా సమంత సన్నిహితులు చేయిస్తున్నారని నాగచైతన్య అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో సమంత తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించారు.

అమ్మాయిపై వదంతులు వస్తే అవి నిజమే అనుకుంటారు.. అదే అబ్బాయిపై వస్తే అమ్మాయే చేయించిందని అంటున్నారు.. అబ్బాయిలూ ఇకనైనా ఎదగండి. మీరు మీ పనిపై, కుటుంబంపై దృష్టి పెట్టండి అని ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా సమంత చేసిన రెండు సినిమాలు శాకుంతలం, యశోద విడుదలకు సిద్దంగా ఉన్నాయి.. ప్రస్తుతం విజయదేవరకొండతో ఓ చిత్రాన్ని చేస్తుంది. ఆ తరువాత బాలీవుడ్, హాలీవుడ్ కు సంబంధించిన చిత్రాల్లో చేయవలసి ఉంది. మరో వెబ్ సిరీస్ కూడా ఆమె చేతిలో ఉంది.

ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమంత తనపై వస్తున్న ట్రోల్స్ కొంత చికాకును కలిగిస్తున్నాయి. అందుకే నెటిజన్స్ ని స్మూత్ గా మందలించి అనవసరంగా మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.. మీ పనిపై దృష్టి సారించండి అని చెబుతోంది.

Tags

Read MoreRead Less
Next Story