న్యూయార్క్‌ ఈవెంట్‌లో 'ఊ అంటావా' పాట.. సమంత రియాక్షన్

న్యూయార్క్‌ ఈవెంట్‌లో ఊ అంటావా పాట.. సమంత రియాక్షన్
సమంత రూత్ ప్రభు న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.

సమంత రూత్ ప్రభు న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్వాహకులు 'ఊ అంటావా' పాటను ప్లే చేయడంతో ఆమె చాలా క్యూట్ గా రియాక్షన్ ఇచ్చారు.

41వ ఇండియా డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సమంత ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నారు. కవాతు తర్వాత, ఆమె క్రూయిజ్‌లో మరో కార్యక్రమానికి హాజరయ్యారు. సభలో సమంత వేదికపైకి రాగానే నిర్వాహకులు ‘ఊ అంటావా’ ప్లే చేయడం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. సమంత తన తల్లితో కలిసి న్యూయార్క్‌లో పర్యటిస్తోంది.

తనను ఇంతలా ఆదరిస్తున్న అమెరికన్లకు కృతజ్ఞతలు తెలుపుతూ సెప్టెంబర్ 1న విడుదల కానున్న 'ఖుషి' చిత్రాన్ని చూడాలని కోరింది. ఇండియా డే పరేడ్ తర్వాత, క్రూయిజ్‌లో జరిగే మరో కార్యక్రమానికి సమంతను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఈ ఈవెంట్‌లోని సమంతా బ్లాక్ అండ్ గోల్డ్ చీరలో మెరిసిపోతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆమె వేదికపైకి రాగానే నిర్వాహకులు అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' నుంచి 'ఊ అంటావా' పాటను ప్లే చేస్తూ తామూ గొంతు పలికారు. వాళ్ల ఉత్సాహాన్ని, తన పై ఉన్న ప్రేమను చూసి సమంత ఆశ్చర్యపోయింది. దీనిపై సమంత స్పందిస్తూ.. ఈ పాట విని చాలా రోజులైంది అని అన్నారు.

ఆమె ఆగస్ట్ 21న ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి న్యూయార్క్ గురించి వివరిస్తూ, తన మొదటి చిత్రం 'యే మాయ చేసావే' కోసం నగరంలో ఎలా షూట్ చేసిందో గుర్తుచేసుకుంది.

"న్యూయార్క్ కలలు కనే ప్రదేశం అని ఆమె రాసుకొచ్చింది. నేను నా సినిమా కెరీర్‌ని ఇక్కడే ప్రారంభించాను..14 సంవత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడు వచ్చాను అని తెలిపింది.Tags

Read MoreRead Less
Next Story