Konda Surekha : కొండా సురేఖ కామెంట్స్ పై సమంత రియాక్షన్

సౌత్ బ్యూటీ సమంత తనపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై మరోసారి స్పందించారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'సిటాడెల్-హానీ బన్నీ' ప్రెస్ మీట్ లో సామ్ తనపై వచ్చిన కామెంట్స్ గురించి మాట్లాడుతూ "నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నా. ఇండస్ట్రీ మహిళలను చిన్నచూపు చూడటం మానేయండి. ఇలాంటి గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే చాలా శక్తి కావాలి. విడాకులు నా వ్యక్తి గత విషయం. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. నేనెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటా. మీరు గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్నారు. మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు. మా విడాకుల విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఇతర వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని" కొండాసురేఖకు సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com