Samantha: మీరు ఎప్పుడూ ఆ పని చేయొద్దు: సమంత

Samantha: మీరు ఎప్పుడూ ఆ పని చేయొద్దు: సమంత
Samantha:ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్న, సమాధానాల సెషన్‌ను నిర్వహించింది

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఇటీవల అభిమానులతో ఇంటరాక్ట్ అయి వివిధ అంశాలపై తన ఆలోచనలను పంచుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్న, సమాధానాల సెషన్‌ను నిర్వహించింది. ఒక అభిమాని పచ్చబొట్టు వేయించుకోవడం గురించి అడిగారు. దానికి సమంత పచ్చబొట్టు అస్సలు వేయించుకోవద్దు అని సలహా ఇచ్చింది.

అయితే సమంత ఒంటిమీద మాత్రం మూడు టాటూలు ఉన్నాయి. అవన్నీ ఆమె మాజీ భర్త నాగ చైతన్యతో కనెక్ట్ అయి ఉంటాయి. కానీ ఇప్పుడు సమంత తన అభిమానులకు ఎప్పుడూ టాటూలు వేంచుకోవద్దని చెబుతోంది.

ఆమె మొదటి పచ్చబొట్టు YMC అని ఉంది. ఇది సామ్, చైతూ కలిసి నటించిన మొదటి చిత్రం ఏ మాయ చేసావే యొక్క షార్ట్ ఫామ్. 2వ పచ్చబొట్టు 'చే' అని రాసి ఉంది. 3వ టాటూ మరింత ప్రత్యేకం. చైతు, సమంత ఇద్దరూ తమ చేతులపై రెండు బాణాలు కలిపి ఒకే టాటూను వేయించుకున్నారు.

సమంతను మరో అభిమాని ఓ బలమైన సందేశం ఇవ్వమని కోరాడు.. దానికి ఆమె "మిమ్మల్ని మీరెప్పుడు తక్కువగా అంచనా వేసుకోకండి.. ఎదుటివారికి మీరెప్పుడు ఛాయిస్ కాకూడదు. నీకిది చేత కాదు.. నువ్వు ఇది చేయలేవు.. ఇలాంటి మాటలు అస్సలు పట్టించుకోవద్దు.. మీమీద మీరు నమ్మకం ఉంచి విశ్వాసంతో పని చేయండి.. తప్పక విజయం సాధిస్తారు. మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు.. మీరు నిరంతరం మీరు చేసే పనిపై శ్రద్ధ వహించండి అని అభిమానికి ఓ మంచి సందేశం ఇచ్చింది సమంత.

Tags

Read MoreRead Less
Next Story