Samantha: సాయి పల్లవి రికార్డును బ్రేక్ చేసిన సామ్.. ఆ విషయంలో సమంతనే నెంబర్ 1..

Samantha: ప్రస్తుతం సినిమాలు ఎలా ఆడాయి, ప్రేక్షకులను ఎంతగా మెప్పించగలిగాయి అనే అంశాలు తెలుసుకోవడానికి కలెక్షన్లను, యూట్యూబ్ రికార్డులనే పరిగణలోకి తీసుకుంటున్నారు అభిమానులు. ఏదైనా సినిమా ట్రైలర్, వీడియో సాంగ్ విడుదలయితే చాలు.. ఆ హీరో అభిమానులంతా కలిసి యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాసే పనిలో పడుతుంటారు. కానీ యూట్యూబ్‌లో వీడియో సాంగ్స్ రికార్డ్ మాత్రం హీరోయిన్లకే సొంతం.
సాయి పల్లవి డ్యాన్స్ ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తూ ఉంటుంది. అందుకే తాను నటించే సినిమాల్లో కచ్చితంగా ఒక పాటలో సాయి పల్లవి డ్యాన్స్ చేసేలా చూసుకుంటారు దర్శకులు. అలా సాయి పల్లవి డ్యాన్స్ చేసిన వచ్చిండే, రౌడీ బేబి, సారంగ దరియా పాటలు యూట్యూబ్‌లో అత్యధికంగా చూసిన వీడియో సాంగ్స్ లిస్ట్‌లో ముందుంటాయి. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది సమంత.
సమంత తన కెరీర్‌లోనే చేసిన ఒకేఒక్క స్పెషల్ సాంగ్.. పుష్ప చిత్రంలోని ఊ అంటావా.. ఊఊ అంటావా. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమా మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అంతే కాకుండా ఇందులో స్పెషల్ సాంగ్ అయితే అందరితో స్టెప్పులు వేయించింది. లిరికల్ సాంగ్ కూడా యూట్యూబ్‌లో విడుదల అవ్వగానే విపరీతంగా వైరల్ అయ్యింది.
పుష్ప సినిమా తాజాగా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సినిమాలోని వీడియో సాంగ్స్‌ను కూడా యూట్యూబ్‌లో విడుదల చేసింది మూవీ టీమ్. అందులో ఊ అంటావా మామ.. ఊఊ అంటావా పాట 24 గంటలు పూర్తి కాకుండానే 10 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించింది. అంతే కాకుండా 16 గంటల్లో 6 మిలియన్ల వ్యూస్‌ను సాధించిన రౌడీ బేబి రికార్డును బ్రేక్ చేస్తూ అదే సమయంలో 9 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com