Samantha: విడాకుల పోస్ట్ డిలీట్.. ఫ్యాన్స్ ఊహించిందే జరగనుందా.. !!

Samantha: విడాకుల పోస్ట్ డిలీట్.. ఫ్యాన్స్ ఊహించిందే జరగనుందా.. !!
Samantha: ఇదిలా ఉంటే సామ్ ఎందుకో సడెన్ ఇన్‌స్టా నుంచి విడాకుల ప్రకటన పోస్ట్ డిలీట్ చేసింది..

Samantha: మా దారులు వేరు.. మేం విడిపోతున్నాం అని ఇద్దరూ ఒకేసారి ప్రకటించారు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ నాగ చైతన్య సమంత.. అంతకు ముందు నుంచే సిగ్నల్స్ పాస్ చేసినా అక్టోబర్ 2న వారిచ్చిన ప్రకటన చూసి అభిమానులు షాకయ్యారు. ఎందుకు విడిపోతున్నారు, ఏమయ్యింది ఇద్దరికీ, ఏం జరిగింది వారి జీవితంలో అని తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా ఇద్దరిలో ఒక్కరూ కూడా బయటపడలేదు..

సమయాన్ని ఏ మాత్రం వేస్ట్ చేయని సామ్ తన జీవితంలో జరిగిన మేజర్ సంఘటనని ఓ పీడకలలా మరిచి పోయి కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంది.. మనసుని స్వాంతన పరుచుకునేందుకు స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళుతోంది.. అల్లు అర్జున్ పుష్పలో ఐటెం సాంగ్ చేసి ఆమె రేంజ్‌ని అమాంతం పెంచేసుకుంది..

ఈ మధ్య కాలంలో ఏ ఐటెం సాంగ్‌కి రానన్ని వ్యూస్ ఊ అంటావా పాటకి వచ్చాయని చిత్ర యూనిట్ తెలిపింది.. ఇదిలా ఉంటే సామ్ ఎందుకో సడెన్‌గా ఇన్‌స్టా నుంచి విడాకుల ప్రకటన పోస్ట్ డిలీట్ చేసింది.. సెలబ్రెటీలు ఏది చేసినా వార్తే కదా అందుకే ఇది కూడా వార్త అయింది.


మనసు మార్చుకుని మళ్లీ కలుస్తున్నారా.. విడిగా ఉండేసరికి విలువ తెలిసిందా.. అభిమానుల్లో ఎన్నో ఆలోచనలు.. సామ్ ఏ పని చేసినా ఎంతో ఆలోచించి చేస్తుంది.. చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది.. దీని వెనుక ఏదో బలమైన కారణమే ఉంటుందని నెటిజన్లు పలు రకాలుగా ఊహించుకుంటున్నారు.

నిజంగా కలుసుకుంటే ఎంత బావుంటుంది.. ఊహించనిది జరగడమే కదా జీవితం అని అనుకునేవాళ్లు కూడా లేకపోలేదు. కాగా, లేటెస్ట్‌గా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌లో నటించేందుకు మూడు ప్రాజెక్టులకు సామ్ సైన్ చేసినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story